
ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక మరోవైపు రాజకీయాలను కూడా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా తనదైన మార్క్ చూపిస్తూ దూసుకెళ్తున్నాడు అని చెప్పాలి. అయితే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఒక సినిమాను మక్కికి మక్కి కాపీ కొట్టి మరో హీరో సినిమా తీశాడు అన్న విషయం కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. అప్పట్లో కరుణాకరన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా బాలు సినిమా వచ్చింది. యావరేజ్ టాక్ మాత్రమే సొంతం చేసుకుంది ఈ సినిమా.
అయితే ఇక ఈ సినిమా స్టోరీ నే మరో స్టార్ హీరో కాపీ చేసి హిట్టు కొట్టాడు అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా బలుపు సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకు కథ అందించింది దర్శకుడు బాబి అని చెప్పాలి. అయితే బలుపు సినిమా స్టోరీ స్క్రీన్ ప్లే మొత్తం కూడా పవన్ కళ్యాణ్ బాలు సినిమాను పోలే ఉంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే రెండు సినిమాల్లో కూడా ఫ్లాష్ బ్యాక్ ఒకే లాగా ఉంటుంది. అలాగే రెండు సినిమాల్లో హీరోయిన్ చనిపోతుంది. ఇక రెండు సినిమాల్లో బాలు సినిమా పెద్దగా ఆడలేదు. కానీ బలుపు మాత్రం సూపర్ హిట్ అయింది. బాలు సినిమా రైటర్ కోన వెంకటే ఇక బలుపు సినిమాకి కూడా స్క్రీన్ ప్లే డైలాగ్స్ రాయడం గమనార్హం.