తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో ఒకరు అయినటు వంటి సుధీర్ వర్మ తాజాగా రావణాసుర అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మాస్ మహారాజా రవితేజ హీరో గా నటించాడు. అలాగే ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో సుశాంత్ నటించగా ... మరి కొన్ని ముఖ్య పాత్రలలో అను ఇమాన్యుయల్ , పరియా అబ్దుల్లా , మేఘ ఆకాష్ , దాక్షా నాగర్కర్ , పూజిత పన్నోడ లు నటించారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన విడుదల చేయనున్నారు.

మూవీ నుండి కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా బృందం టీజర్ ను విడుదల చేసింది. రవితేజ డైలాగ్ డెలివరీ అలాగే సుశాంత్ పాత్ర కూడా బాగుండడంతో ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. అలాగే ఈ సినిమా బృందం ఈ సినిమా నుండి కొన్ని పాటలను కూడా విడుదల చేయగా వాటికి కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా దర్శకుడు అయినటు వంటి సుధీర్ వర్మమూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజాగా సుధీర్ వర్మ "రావణాసుర" మూవీ గురించి మాట్లాడుతూ ... ఈ మూవీ అసలు ఎలాంటి సినిమాకి కూడా రీమేక్ కాదని ... ఇది కేవలం రవితేజ గారిని దృష్టిలో పెట్టుకొని రాసుకున్న కంప్లీట్ న్యూ స్టోరీ అని ఈ దర్శకుడు కన్ఫామ్ చేశాడు. రామేశ్వర్ మరియు భీమ్స్ సంగీతం అందించిన ఈ మూవీ ని అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మించారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: