ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దసరా పండక్కి కూడా కొన్ని సినిమాలు విడుదల కాబోతున్నాయి. అందులో కొన్ని సినిమాల విడుదల తేదీలు ఇప్పటికే ప్రకటించగా ... మరి కొన్ని సినిమాల విడుదల తేదీలు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సంవత్సరం దసరా కు విడుదలకు రెడీగా ఉన్న సినిమాలు ఏవో తెలుసుకుందాం. తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ హీరోగా తమిళ సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి లోకేష్ కనకరాజు దర్శకత్వంలో ప్రస్తుతం లియో అనే మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. 

ఈ మూవీని ఈ సంవత్సరం అక్టోబర్ 19 వ తేదీన విడుదల చేయనున్నారు . ఈ విషయాన్ని ఈ మూవీ యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం రామ్ పోతినేని ... బోయపాటి కాంబినేషన్ లో ఒక మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది . ఈ మూవీ లో రామ్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ రెండు మూవీ లతో పాటు బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను కూడా దసరా పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది . ఈ మూవీ విడుదల తేదీని మరి కొన్ని రోజుల్లోనే ప్రకటించబోతున్నారు. ఇలా ఈ మూడు క్రేజీ మూవీ లు ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా విడుదల కాబోతున్నాయి. ఈ మూడు మూవీ లపై కూడా ప్రస్తుతం సినీ ప్రేమికుల భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: