
బాలయ్య ,అనిల్ రావుపూడి కాంబినేషన్లో వస్తున్న 108 వ చిత్రంని తెరకెక్కిస్తూ ఉన్నారు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది .ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా శ్రీ లీల బాలయ్య కూతురు పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం రిలీజ్ డేట్ లాక్ చేయడం జరిగింది దసరా పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు ఒక అధికారికంగా పోస్టర్‌తో విడుదల చేయడం జరిగింది.. హీరో రామ్ పోతినేని బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న చిత్రానికి కూడా ఇంకా టైటిల్ అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. కానీ ఈ సినిమా పోస్టర్‌ను విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రం కూడా దసరాకి విడుదల అయ్యేవిధంగా ప్లాన్ చేస్తున్న సమాచారం. రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా దసరాకి విడుదల చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇలా మూడు సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ వద్ద విడుదల చేయడంతో థియేటర్లు దొరకక ఇబ్బంది పడడంతో పాటు సినిమా బాగున్నప్పటికీ కలెక్షన్ల పరంగా సక్సెస్ కాలేకపోతాయని సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. మరి రవితేజ రామ్ లలో ఎవరు ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసుకుంటారా చూడాలి మరి. ఇక గతంలో కూడా స్టార్ హీరోల సినిమాలు విడుదలై థియేటర్లో సమస్యతో ఇబ్బంది పడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సినిమాలను ఎలా పోస్ట్ ఫోన్ చేస్తారో విడుదల చేస్తారో చూడాలి మరి.