ఇక ఆ తర్వాత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడి ఎంతో కష్టంగా ఈ వ్యాధిని జయించింది. ఇక ఇప్పుడు తన కెరీర్ను మళ్ళీ బిల్డ్ చేసుకోవడానికి ఎంతగానో కష్టపడుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే గుణశేఖర్ దర్శకత్వంలో సమాంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన శాకుంతలం సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది అన్న విషయం తెలిసిందే. శకుంతల, దుష్యంతుల ప్రేమ కావ్యంగా ఇక ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో దుష్యంతుడిగా మలయాళ హీరో దేవ్ మోహన్ కనిపించబోతున్నాడు.
ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ట్రైలర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి అని చెప్పాలి. ప్రస్తుతం సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో సమంత వరుసగా ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది అని చెప్పాలి. అయితే సమంత నటించిన శాకుంతలం సినిమా దాదాపు హిట్ అయిపోయినట్లే అని విడుదలకు ముందే కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. కారణం ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాకు పోటీగా ఏ పెద్ద సినిమా లేదు. దీనిబట్టి సినిమా సగం సేఫ్ అని చెప్పొచ్చు. అందులోనూ 3d సినిమా కావడంతో విజువల్స్ కోసమైనా ప్రేక్షకులు థియేటర్కు వస్తారు. ఇక సమంత మయూసైటిస్ వ్యాధి నుంచి బయటపడిన తర్వాత వస్తున్న మొదటి సినిమా కావడంతో ఇక అభిమానులు ఈ సినిమా చూసేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఇక ఇవన్నీ కలిసి వచ్చి మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చిందంటే ఈ సినిమా తిరుగులేని విజయం సాధించడం పక్క అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి