
గత ఎడాది భారీ అంచనాల మధ్య విడుదలైన పక్కా కమర్షియ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తనకు అచ్చోచ్చిన డైరెక్టర్ శ్రీవాస్ ను నమ్ముకొని మరి రామబాణం సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. పైగా ఈ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో ఈ సినిమా పైన భారీగానే అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాను సమ్మర్ కానుకగా మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఇటీవల చిత్ర బృందం తెలియజేసింది. ఈ క్రమంలోనే మేకర్స్ వరుసగా ఈ సినిమా గురించి అప్డేట్లను ప్రకటిస్తూ ఉన్నారు.
ఈ సినిమా విడుదలకు ఇంకా రెండు వారాలు మాత్రమే సమయం ఉండడంతో ఇప్పటినుంచే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు చిత్ర బృందం. ఈ సినిమా ట్రైలర్ను ఈ రోజున విడుదల చేసేందుకు భారీగా ప్లాన్ వేశారు. రాజమండ్రిలోని మార్గాన్ని ఎస్టేట్లో ఈ సినిమా ట్రైలర్ను చాలా ఘనంగా నిర్వహించబోతున్నట్లు మేకర్స్ తెలియజేశారు. యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో గోపీచంద్ సరసన డింపుల్ హయాతి నటిస్తున్నది. కీలకమైన పాత్రలో హీరోయిన్ ఖుష్బూ, జగపతిబాబు కూడా నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రంతో అటు గోపీచంద్ కెరియర్ డైరెక్టర్ కెరియర్ మలుపు తిరుగుతుందేమో చూడాలి మరి.