హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం విరూపాక్ష.. ఈ చిత్రం బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ ఆధారంగా డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్గా సంయుక్త మీనన్ నటించడం జరిగింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు.సుకుమార్ రైటింగ్ ప్రొడక్షన్స్ లో ఈ సినిమాని నిర్మించడం జరిగింది.. ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి షో తోనే సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకున్నది.


కాక థియేటర్లో ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ ను చూసేందుకు నిర్మాత ప్రసాద్ డైరెక్టర్ కార్తీక్, హైదరాబాదులో పలు ధియేటర్లను సందర్శించడం జరిగింది. ఈ ప్రయాణంలో కార్తీక్ మొబైల్ చోరీకి గురైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే నిర్మాత ప్రసాద్ పర్స్ కూడా ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు కొట్టేసారని తెలుస్తోంది. అయితే ఈ ప్రయాణంలో ఈ రెండు ఎక్కడ మిస్ అయ్యాయని విషయం తెలియకపోవడంతో పోలీస్ కంప్లైంట్ వరకు వెళ్లకూడదని దర్శక నిర్మాతలు భావించినట్లు సమాచారం. ఈ విషయమైతే సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.


విరూపాక్ష సినిమా సక్సెస్ విషయానికి వస్తే మొదటి రోజే 12 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించింది. సాయి ధరమ్ తేజ్ కెరియర్ లోని ఈ సినిమా బిగ్గెస్ట్ ఓపెనింగుగా నిలిచింది.. యూఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల హవా కూడా కొనసాగిస్తోంది ఇప్పటికే అక్కడ మొదటి రోజే 200 k డాలర్లకు పైగా కలెక్షన్ రాబట్టినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగులో మాత్రమే విడుదల చేసిన ఈ చిత్రం త్వరలోనే ఇతర భాషలలో కూడా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాతో మెగా హీరో సక్సెస్ కొట్టడంతో ఫుల్ జోష్ గా ఉన్నది. మరి తన తదుపరి చిత్రాన్ని ఏ డైరెక్టర్ తో చేస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: