సాయి ధరం తేజ్ కెరియర్ ఆరంభంలో కొన్ని మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. కానీ ఆ తర్వాత ఆయన నుండి వచ్చిన ప్రతి ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరుస్తూనే వచ్చింది. ఎట్టకేలకు వచ్చిన విరూపాక్ష చిత్రం సాయి ధరం తేజ్ కి కమర్షియల్ సక్సెస్ ని అందించడంతో మెగా అభిమానులతో పాటు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంతా హ్యాపీగా ఉన్నారు.
సాయి ధరంతేజ్ విరూపాక్ష చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో వరుసగా సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆయనతో ఇద్దరు ముగ్గురు నిర్మాతలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. యంగ్ దర్శకులతో పాటు సీనియర్ దర్శకులు కూడా సాయి ధరమ్ తేజ్ కోసం కథలు సిద్ధం చేస్తున్నారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో సాయి ధరం తేజ్ నుండి వరుసగా ఏడాదికి రెండు మూడు సినిమాలు చొప్పున వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం సాయి ధరం తేజ్ తన రెమ్యూనరేషన్ని పెంచే విషయమై కూడా ఆలోచిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. సినిమా కు ఇచ్చే డేట్స్ ఆధారంగా రెమ్యూనరేషన్ ని భారీగా పెంచాలని తేజ్ భావిస్తున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. అతి త్వరలోనే సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా ప్రారంభం కాబోతుంది.
మరో వైపు పవన్ కళ్యాణ్ తో కలిసి సాయి ధరమ్ తేజ్ వినోదయ సీతమ్ రీమేక్ లో నటించాడు. ఆ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయినట్లుగా దర్శకుడు సముద్ర ఖని స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. మావయ్య పవన్ కళ్యాణ్ తో నటిస్తున్న సినిమా అవ్వడంతో ఆ రీమేక్ పై అంచనాలు భారీగా సాయిధరమ్ తేజ్ పెట్టుకున్నాడు. ఆ సినిమా సక్సెస్ అయితే కచ్చితంగా తేజ్ మరింత బిజీ అయ్యే అవకాశాలు లేకపోలేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి