ఎం ఎస్ ధోని ది ఆన్ టోల్డ్ స్టోరీ : సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరో గా కియార అద్వానీ హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమాను మే 12 వ తేదీన థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.
రెడీ : రామ్ పోతినేని హీరో గా జెనీలియా హీరోయిన్ గా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన రెడీ మూవీ ని మే 14 వ తేదీన థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.
సింహాద్రి : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా భూమిక , అంకిత హీరోయిన్ లుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సింహాద్రి మూవీ ని మే 21 తేదీన థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు.
ఆది : జూనియర్ ఎన్టీఆర్ హీరో గా వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ని మే 20 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటి వరకు వెలవడక బోయినప్పటికీ ఇదే తేదీన ఈ సినిమా రీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి