ఇలా ఇటీవల కాలంలో తరచూ సినిమా హీరోలకు సంబంధించిన ఏదో ఒక త్రో బ్యాక్ ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూనే ఉంది. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఫోటోనే ఒకటి ఇంటర్నెట్లో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఫోటోలో కనిపిస్తున్న బుడ్డోడు తమిళ్లో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. అయితే ఇప్పటికే తమిళ్ హీరోలు ఎంతోమంది తెలుగులో కూడా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నారు. ఇక అతగాడు కూడా ఇలాగే తమిళ్లో స్టార్ హీరో అయినప్పటికీ తెలుగులోనూ భారీగానే అభిమానులను సంపాదించుకున్నాడు.
అతను నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో డబ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి అని చెప్పాలి. ఇక ఎప్పుడు మరో సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇంతకీ అతను ఎవరో గుర్తుపట్టారా.. ఎవరో కాదు తమిళ హీరో జీవ. రంగం, స్నేహితుడు లాంటి సినిమాల్లో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన జీవ.. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. 2003 సంవత్సరంలో ఆసాయ్ అనే చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలోకి హీరోగా అడుగు పెట్టాడు జీవ. ఇక తనదైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి