మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఇంకా టాలీవుడ్ లక్కీ హీరోయిన్ గా వరుస హిట్లు కొడుతున్న మలయాళి బ్యూటీ నటించిన విరూపాక్ష మూవీ ఏప్రిల్ 21న రిలీజ్‌ అయి.. సూపర్ డూపర్ రెస్పాన్స్‌ రాబట్టుకుంటూ..బాక్సాఫీస్‌ వేలో బాగా దూసుకుపోయింది.ఈ సినిమా రిలీజ్ కు ముందు దాదాపు ఎలాంటి బజ్ లేకుండా రిలీజ్ అయ్యింది.తరువాత రిలీజ్ అయిన దగ్గర నుంచి.. అన్‌ బిలీవబుల్ టాక్తో థియేటర్లలో.. హౌస్‌ ఫుల్‌గా ఈ సినిమా రన్‌ అయ్యింది. ఈ సినిమా హార్రెర్‌ సీన్స్‌తో ఆడియెన్స్ కు స్పైన్ చిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను కలిగిస్తోంది. ఈ మూవీని చూసేందుకే అందర్నీ కదిలేలా ఇంకా థియేటర్ల వైపు పరుగులు పెట్టేలా చేస్తోంది. ఇక ఈ కమ్రంలోనే… ఏకంగా వంద కోట్లు సాధించేసింది ఈ మూవీ.సాయిని స్టార్ హీరోగా మార్చేసింది.ఇక రీసెంట్ గా ఓటీటీలోకి కూడా అడుగు పెట్టింది విరూపాక్ష మూవీ.


విరూపాక్ష సినిమాలో సాయి ధరమ్ తేజ్ కు జోడీగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.. హరర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను చాలా విపరీతంగా ఆకట్టుకుంటుంది.అలాగే ఓటీటీలో కూడా మంచి వ్యూస్ రాబడుతోంది విరూపాక్ష మూవీ. బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో తేజ్ తన నటనతో ఎంతగానో ఆకట్టుకున్నారు.ఇక ఫేమస్ ఓటీటీ కంపెనీ నెట్ ఫ్లిక్స్ లో విరూపాక్ష స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్స్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ ఓటీటీలోనూ రికార్డు స్థాయిలో వ్యూస్ ను రాబడుతూ.. ఓటీటీలో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది విరూపాక్ష. ఇక మిగతా భాషల్లో కూడా త్వరలో స్ట్రీమింగ్ కానుంది.ఈ సినిమా తర్వాత తేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి చేస్తోన్న విషయం తెలిసిందే.. సముద్ర ఖని దర్శకత్వంలో బ్రో అనే ఈ మూవీలో నటిస్తున్నాడు సాయి ధరమ్ తేజ్.మరి ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: