టాలీవుడ్ హాట్ హీరోయిన్ డింపుల్ హాయాతి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. మొన్నటికి మొన్న రామబాణం సినిమా ప్రమోషన్స్ లో ఈమె పాల్గొన్న టైంలో .. మీరు ఈ ఫ్యామిలీ మూవీలో వల్గర్ గా కనిపించారు..అంటూ ఓ రిపోర్టర్ అనడంతో ఈమె బాగా హర్ట్ అయిపోయి గూగుల్ లో వల్గర్ అనే మాటకు అర్థం వెతుకుతున్నట్టు స్క్రీన్ షాట్ లని షేర్ చేసింది.దీంతో ఆ టాపిక్ అప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.ఇక ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె పై క్రిమినల్ కేసు నమోదవ్వడం కూడా బాగా కలకలం రేపింది అని చెప్పాలి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. డింపుల్ ప్రస్తుతం జర్నలిస్ట్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో అంటున్నారు. ఇంకా అదే అపార్ట్మెంట్లో ట్రాఫిక్ డిసిపి కూడా ఉంటున్నారు.అయితే ఇక అక్కడ పార్క్ చేసిన డిసిపి రాహుల్ కారును డింపుల్ ఫ్రెండ్ ఢీ కొట్టారు. ఈ నేపథ్యంలో రాహుల్ అలాగే డింపుల్ ఇంకా డేవిడ్ ల పై గొడవ మొదలైంది. ఇదే క్రమంలో డింపుల్ ..రాహుల్ కారుని కాలితో తన్ని అతన్ని బెదిరించడం జరిగింది.


 దీంతో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో డింపుల్ ఇంకా డేవిడ్ ల పై క్రిమినల్ కేసు నమోదు చేశాడు రాహుల్. దీంతో డింపుల్ ఇప్పుడు పెద్ద చిక్కుల్లో పడినట్టు అయ్యింది.2017 వ సంవత్సరంలో వచ్చిన 'గల్ఫ్' అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన డింపుల్ హయతి తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'గద్దలకొండ గణేష్' చిత్రంలో 'జర్రా జర్రా' అనే ఐటెం సాంగ్ చేసి బాగా పాపులర్ అయ్యింది. అటు తర్వాత 'యురేకా' ,రవితేజ -రమేష్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన 'ఖిలాడి' ఇంకా విశాల్ హీరోగా తెరకెక్కిన 'సామాన్యుడు', ధనుష్ - అక్షయ్ కుమార్ కాంబినేషన్లో వచ్చిన 'అత్రంగి రే' వంటి క్రేజీ సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించింది. ఇటీవల వచ్చిన రామబాణం లో కూడా ఈమె హీరోయిన్ గా నటించగా ఇక ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. అయినా డింపుల్ చేతిలో మంచి ఆఫర్లే ఉన్నాయని సమాచారం తెలుస్తుంది. ఇక డింపుల్ మరోసారి ఐటమ్ సాంగ్స్ చేస్తుందంటూ సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వస్తున్నాయి. అయితే తాను ఎలాంటి ఐటమ్ సాంగ్స్ చెయ్యడం లేదని డింపుల్ హయాతి చెప్పేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: