తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ హీరోలలో సిద్దు జొన్నలగడ్డ ఒకరు. ఈయన తన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో నటించాడు. కానీ వాటి ద్వారా ఈ నటుడికి హీరోగా పెద్దగా గొప్ప గుర్తింపు లభించలేదు. పోయిన సంవత్సరం ఈ యువ హీరో డీజే టిల్లు అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ సినిమా విడుదలకు ముందే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలకు ... పాటలకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. వాటితో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి.

అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకొని అద్భుతమైన విజయం సాధించింది. అలాగే ఈ సినిమాలో సిద్దు బాడి లాంగ్వేజ్ కు ... డ్రెస్సింగ్ స్టైల్ కు ... ఆటిట్యూడ్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. దానితో డిజె టిల్లు మూవీ మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా ఈ మూవీ లోని సిద్దు నటనకు కూడా ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. దానితో ప్రస్తుతం ఈ యువ నటుడు డిజె టిల్లు మూవీ కి సీక్వెల్ గా రూపొందుతున్న టిల్లు స్క్వేర్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. ఈ సినిమాను ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే టిల్లు స్క్వేర్ మూవీ తర్వాత ఈ హీరో నటించబోయే మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ యువ హీరో టిల్లు స్క్వేర్ మూవీ తర్వాత నీరజా కోన దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరో గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే సిద్దు ... మీరాజా కోన కాంబినేషన్ లో రూపొందబోయే మూవీ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే బయటికి రాబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: