టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి సంక్రాంతి సీజన్ చాలా ముఖ్యమైనది. ఈ సీజన్లో వచ్చే సినిమాలకు కలెక్షన్స్ ఊహించని స్థాయిలో వస్తాయి .ఎంత పెద్ద హీరో అయినా ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే సినిమాలను సంక్రాంతి సీజన్ లోని విడుదల చేయాలని అనుకుంటారు. టాలీవుడ్ లో ఎక్కువగా సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలి అన్న హీరోల్లో అప్పట్లో ముందుగా నందమూరి బాలకృష్ణ ఉండేవారు .కానీ ఇప్పుడు మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నారు. ఈయన ఫిలిం గ్రాఫ్ పరిశీలిస్తే 50 శాతానికి పైగానే ఆయన నటించిన సినిమాలన్నీ కూడా సంక్రాంతి సీజన్ లోనే విడుదలయ్యాయి.

 ప్రస్తుతం త్రివిక్రమ్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం సినిమా కూడా జనవరి 13న విడుదల కాబోతుంది. అంతేకాదు ఈ నెల 31వ తేదీన ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్ప్స్ వీడియో ని కూడా విడుదల చేయబోతున్నారట. అదే సంక్రాంతి సీజన్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న లలో ఏదో ఒక సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఉస్తాద్ భగత్ సింగ్ కంటే ముందుగా ఓ జి సినిమా రెగ్యులర్ షూటింగ్ పూర్తయింది.దీనితో సంక్రాంతికి ఓ జి సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్సినిమా విడుదల కాకుండా వాయిదా వేయించినట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ ఇద్దరు ప్రాణ స్నేహితులు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ని రిక్వెస్ట్ చేయడంతో పవన్ వెనక్కి తగ్గి ఈ సినిమా విడుదల వాయిదాకు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఇక సంక్రాంతి సీజన్ లో విడుదలయ్యే సినిమాల కలెక్షన్స్ కనీసం 300 కోట్లకు పైగాని వస్తుంది. దీంతో ఒకవేళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా విడుదలయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఒక ఊపు ఊపేసేది అంటూ ఫ్యాన్స్ నిరాశపడుతున్నారు ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: