సాయి పల్లవి అందానికి అలాగే పర్ఫార్మెన్స్‌ కు సెలబ్రెటీలు కూడా ఫిదా అవుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య.. సాయి పల్లవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడటా.. ఆమె తన క్రష్ అంటూ కూడా స్పష్టం చేశాడు.

ఓ ఇంటర్వ్యూ లో భాగం గా మాట్లాడిన గుల్షన్.. సాయి పల్లవి అంటే తన కు క్రష్ అని, అయితే ఆమెకు చెప్పే సాహసం కూడా చేయలేదని తెలిపాడు. "నాకు సాయి పల్లవి అంటే చాలా క్రష్. చాలా కాలం నుంచి ఆమె అంటే ఇష్టం ఉంది. ఆమె నంబర్ కూడా నా వద్ద ఉంది. కానీ ఆమె దగ్గరకు వెళ్లి ఈ విషయం చెప్పే సాహసం అయితే చేయలేదు. ఆమె వండర్‌ఫుల్ డ్యాన్సర్, అద్భుతమై న నటి. ఆమె అంటే నాకు క్రష్ మాత్రమే. అంతకుమించి ఏమి కూడా లేదని అనుకుంటున్నా. కొన్నిసార్లు ఆమె ను చూసి ఆకర్షితుడిని అయ్యాను. కానీ ఆమె ఎంతో సమర్థురాలైన నటి. ఏదోక రోజు ఆమెతో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుందేమోనని అయితే ఆశిస్తున్నా. అది చాలు నేను ఆనందంగా ఉండటానికి. మిగతాది మాత్రం నాకు తెలియదు. ఒకవేళ మిగిలినది జరగకపోతే ఏం చేస్తాను? అని కూడా నాకు అనిపిస్తుంది. అంటూ సాయి పల్లవి అంటే తనకు ఎంతో ఇష్టమో చెప్పాడు" గుల్షన్ దేవయ్య.

"ఆ ఉద్దేశం ఉంటే అది జరుగుతుంది. ఒకవేళ ఆ ఉద్దేశ్యం లేకపోతే మాత్రం జరగదు. అయితే మంచి నటితో నటించే అవకాశం వస్తే మాత్రం చాలా బాగుంటుంది. అందులో తప్పేమి లేదు. కనీసం అంతవరకైనా సర్దుకుంటాను" అని గుల్షన్ తెలిపాడటా.. అతడి వ్యాఖ్యలు బట్టి చూస్తే సాయి పల్లవితో వర్క్ చేయాలని, ఆమెతో తన అభిప్రాయాన్ని చెప్పాలని గుల్షన్ ఆరాట పడుతున్నాడని మాత్రం అర్థమవుతుంది. మరి ఈ హీరో కోరికను సాయి పల్లవి తీరుస్తుందోలేదో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: