[ఏ చిత్ర పరిశ్రమలో అయినా కూడా హీరో హీరోయిన్లు ఒకటి రెండు సినిమాలలో కలిసి నటించారు లేదా కొద్దిగా చనువుగా ఉన్నారు అంటే చాలు ఇక వారిద్దరి మధ్య డేటింగ్ లు, ప్రేమలు, సహజీవనాలు అంటూ రకరకాల వార్తలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా మంది సెలబ్రిటీలను ఒకవైపు పాపులర్ చేస్తూనే మరొకవైపు మరింత హాట్ టాపిక్ గా అయితే మారుస్తున్నారు. అంతేకాదు గతంలో జరిగిపోయిన విషయాలను కూడా మళ్లీ బయటకు తీస్తూ మరింత వైరల్ గా మారుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గతంలో చిరంజీవి కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు మళ్లీ తెరపై కి రావడం విశేషం..

వాస్తవానికి చిరంజీవి చాలా చిన్న వయసులోనే అల్లు రామలింగయ్య కూతురు సురేఖను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తొందరగా పెళ్లయింది కాబట్టి ఆయన జీవితంలో ఎలాంటి కాంట్రవర్సీలు కూడా లేవని అందరూ అనుకున్నారు కానీ ఆయన జీవితంలో కూడా ఇలాంటి ఎన్నో రూమర్స్ సృష్టించారన్నది ఇప్పుడే ఒక్కొక్కటిగా అయితే బయటపడుతోంది. ముఖ్యంగా ఆ రోజుల్లో చిరంజీవి రాధా, రాధిక ,సుమలత మరియు విజయశాంతి వంటి హీరోయిన్లతో రిపీట్ గా చాలా సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఆయన సుమలతతో ప్రేమాయణం కూడా నడిపాడని.. వాళ్ళిద్దరూ కూడా డేటింగ్ చేసుకుంటున్న విషయం ఇంట్లో తెలిసి గొడవలు కూడా జరిగాయని వార్తలు వినిపిస్తూ నే ఉంటాయి. అయితే ఈ వార్తలపై సుమలత అప్పట్లోనే చాలా తీవ్రంగా అయితే ఖండించింది. అంతేకాదు అలాంటి అసత్య ప్రచారాలు చేసిన వారిపై పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చిందటా . ఆ తర్వాత చిరంజీవి రంగంలోకి దిగి చాలా సీరియస్గా రియాక్ట్ అయి ఆ రూమర్స్ ఖండించారు.

ఇక ఎప్పుడైతే ఇలాంటి రూమర్లు షికార్లు చేశాయో ఇక దాంతో వీళ్లిద్దరు సినిమాలు చేయకూడదని అయితే నిర్ణయించుకున్నారు.ఇక సుమలత భర్త అంబరీష్ మెగాస్టార్ చిరంజీవికి ప్రాణ స్నేహితుడు అన్న సంగతి అందరికీ తెలిసిందే .

మరింత సమాచారం తెలుసుకోండి: