సినిమా ఇండస్ట్రీలో పాత హిట్ సినిమాల టైటిల్స్ ని తీసుకోవడం అన్నది కొత్త ఏమీ కాదు. గతంలో ఆ విధంగా చాలా సినిమాలు విడుదల అయిన విషయం తెలిసిందే. ఉదాహరణకి ప్రస్తుతం విజయ దేవరకొండ నటిస్తున్న ఖుషి సినిమా టైటిల్ తో గతంలో పవన్ కళ్యాణ్ భూమిక కలిసి నటించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు అదే టైటిల్ తో సమంత విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్న సినిమా రాబోతోంది. కానీ ఇప్పటివరకు బాలీవుడ్ టైటిల్స్ తీసుకోవడం అన్నది చాలా తక్కువగా జరిగిందని చెప్పవచ్చు.

ప్రస్తుతం టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మానందం ప్రధాన పాత్రలో హవీష్ హీరోగా రూపొందిన సినిమాకి ఎస్ బాస్ పేరుని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన షూటింగు కూడా గుర్తు చప్పుడు కాకుండా జరిగిపోయిందని సమాచారం. ఈ మధ్య కాలంలో బ్రహ్మి చేయని ఒక ఫుల్ లెన్త్ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ ని ఇందులో డిజైన్ చేశారట. ప్రమోషన్ ఇంకా మొదలు పెట్టలేదు కాబట్టి అసలు ఇది ఉందనే సంగతే కూడా ఎవరికీ తెలియకుండా పోయింది. షారుఖ్ ఖాన్ జుహీ చావ్లా జంటగా 1997లో ఎస్ బాస్ అనే సూపర్ హిట్ మూవీ వచ్చింది. ఆ సినిమా టైటిల్ ని మళ్ళీ ఎవరూ కూడా ఉపయోగించలేదు. ఇకపోతే బ్రహ్మానందం నటిస్తున్న ఎస్ బాస్ సినిమా విషయానికి వస్తే.. అశోక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో అనుష్క నటించిన భాగమతి సినిమాకు దర్శకత్వం వహించారు అశోక్. ఈ సినిమాతో పాటు గతంలో పలు సినిమాలు రూపొందించినప్పటికీ అవి అంతగా సక్సెస్ కాలేకపోయాయి. ఇక అశోక్ దర్శకత్వం వహించిన వాటిలో చెప్పుకోదగ్గ సినిమా ఏదైనా ఉంది అంటే పిల్ల జమిందార్ అని చెప్పవచ్చు. మరి ఈ సినిమాతో అశోక్ ఏ మేరకు సక్సెస్ ను సాధిస్తాడో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: