
ఇక లేటెస్ట్ గా పైన ఒక జాకెట్ మాత్రమే అది కూడా స్లీవ్ లెస్ తో బాబోయ్ బేబమ్మ కూడా స్కిన్ షో కి రెడీ అని హింట్ ఇచ్చేస్తుందని అనిపిస్తుంది. సినిమాలతో సంబంధం లేకుండా ఫోటో షూట్స్ వల్ల హీరోయిన్స్ కి మంచి క్రేజ్ లభిస్తుంది. కృతి శెట్టి ఇన్నాళ్లకు ఆ సీక్రెట్ కనిపెట్టింది. అందుకే అమ్మడు ఇక వరుస ఫోటో షూట్స్ తో హంగామా చేస్తుంది. లేటెస్ట్ ఫోటో షూట్ అయితే అమ్మడు అందాలను గుమ్మరించేసిందని చెప్పొచ్చు. ముఖ్యంగా తన ఫోకస్ అంతా కూడా తన ఫాలోవర్స్ ని తన అందాలతో టెంప్ట్ చేసేలా ఉందని చెప్పొచు.
రీసెంట్ గా కస్టడీ కూడా ఫ్లాప్ అవగా రాబోతున్న శర్వానంద్ సినిమా మీదే తన ఫోకస్ పెట్టింది అమ్మడు. అంతేకాదు మలయాళంలో టోవినో థామస్ తో కూడా ఒక సినిమా చేస్తుంది కృతి శెట్టి. ఇక లేటెస్ట్ ఫోటో షూట్ కి అమ్మడు ఒక కామెంట్ కూడా జత చేసింది. ఏ ఫ్రెష్ స్టార్ట్ ఇది కొత్త ప్లేస్ కాదు కొత్త మైండ్ సెట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అంటూ మెసేజ్ ఇస్తుంది అమ్మడు. మరి అమ్మడు తన మీద తనకు నమ్మకం ఉంచుకునే క్రమంలో ఇలాంటి మెసేజ్ ఇస్తుందా అని డౌట్ పడుతున్నారు ఆడియన్స్. ఏది ఏమైనా బేబమ్మ అందాలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయని చెప్పొచ్చు.