'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిన సంగతి తెలిసిందే. రాజమౌళి లాంటి డైరెక్టర్ తో పని చేయకపోయినా బన్నీ తన టాలెంట్ పాన్ ఇండియా ఇమేజ్ను కైవసం చేసుకున్నాడు. ప్రస్తుతం పుష్ప2 షూటింగ్ తో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఇక పుష్ప2 తర్వాత కూడా అగ్ర దర్శకులతో ఫ్యాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేసేందుకు పక్కా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక బన్నీ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. స్నేహ రెడ్డిని బన్నీ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జంట ఇంట్లో వాళ్ళని ఒప్పించి మరి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. 

ఇక బన్నీ ఫ్యామిలీనే కాదు స్నేహ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ కూడా పెద్ద సౌండ్ పార్టీనే. అయితే స్నేహారెడ్డి కంటే ముందు బన్నీ ఓ స్టార్ హీరోయిన్ ని ప్రేమించాడట. ఈ విషయాన్ని బన్నీ గతంలోనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. ఇంతకీ ఆమె మరెవరో కాదు మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్. ఐశ్వర్యారాయ్ మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకున్నప్పుడు ఆమె అందానికి ఫిదా అయిపోయాడట అల్లుఅర్జున్. దాంతో ఐశ్వర్యరాయ్ పై లవ్ పెంచేసుకున్నాడట. ఇక తర్వాత ఐశ్వర్యరాయ్ బాలీవుడ్ హీరో అమితాబచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్ ని పెళ్లి చేసుకుంది. ఆ సమయంలో బన్నీ తెగ ఫీలైపోయాడట. ఇక ఈ విషయాన్ని స్వయంగా అల్లు అర్జున్ ఇంటర్వ్యూలో తెలిపాడు.

 దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి.  ఇక ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ అయితే బన్నీ ఐశ్వర్య రాయ్ కలిసి నటిస్తే బాగుంటుందంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక బన్నీ పుష్ప2 విషయానికొస్తే.. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి ఇటీవలే బన్నీ బర్త్ డే సందర్భంగా విడుదలైన టీజర్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ సుమారు 400 కోట్ల భారీ బడ్జెట్లో నిర్మిస్తున్న ఈ సినిమాని ఈ ఏడాది చివర్లోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఫాహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్, జగపతిబాబు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: