
ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లకు సినీ అభిమానులు, ప్రేమికుల నుంచి మంచి ఆదరణ లభించిన తర్వాత బోల్డ్ కంటెంట్ విపరీతంగా పెరిగిపోయింది. సెన్సార్ అడ్డంకులు లేకపోవడంతో డైలాగ్స్ మాత్రమే కాకుండా సన్నివేశాల చిత్రీకరణలో హద్దు దాటుతున్నారనే విషయంపై భారీగా చర్చ జరుగుతున్నది. ఇలాంటి నేపథ్యంలో జీ కర్దా ట్రైలర్ మరోసారి చర్చకు దారి తీసింది.జీ కర్దాట్రైలర్‌లో చూపించిన ప్రకారం.. చిన్ననాటి స్నేహితుల మధ్య జరిగిన డేటింగ్ వ్యవహారం.. ఆ తర్వాత పెళ్లి నిశ్చయం కావడమనే అంశాలు కనిపించాయి. తప్పతాగి పొరపాటున ప్రపోజ్ చేశావా? అంటే.. అలాంటిదేమీ లేదు సాలే అంటూ ఇద్దరు స్నేహితులు మాట్లాడుకోవడం ఆసక్తికరంగా అనిపించింది. ప్రేమికురాలికి ప్రపొజ్ చేసిన అంశం ఆసక్తికరంగా కనిపించింది.
తన కూతురుకు అబార్షన్ జరిగిన విషయాన్ని తల్లి బోల్డుగా చెప్పే సన్నివేశంలో తమన్నా ఫెర్ఫార్మెన్స్ అదరగొట్టేసింది. 12 ఏళ్ల నుంచి రిలేషన్స్‌లో ఉన్నావు. వెకేషన్స్ నుంచి అబార్షన్ వరకు అన్నీ అనుభవించావు. ఆ విషయం వాళ్లకు తెలుసా? అని పెళ్లి చూపుల్లో చెబితే.. అబార్షనా? అంటూ పెళ్లి కొడుకు తరఫు వాళ్లు నోరు వెళ్ల బెట్టడం కనిపించింది. నీవు కేవలం సెక్స్, పిల్లల్ని కనడం కోసమేనా అంటూ కామెంట్లు వినిపించాయి.
పెళ్లి నిశ్చితార్థం జరిగిన తర్వాత చాలా కొత్త బిహేవ్ చేస్తున్నావు. నేనెవరో తెలియని విధంగా ఫోజు కొడుతున్నావు అంటూ కాబోయే భర్తను తమన్నా అనడం బట్టి.. ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు కొనసాగుతున్నట్టు అనిపించాయి. అంతేకాకుండా నేనేమైనా తప్పు చేశానా? అని కాబోయే భర్త అంటే.. అవునేమో అంటూ తమన్నా జవాబివ్వడం ఈ వెబ్ సిరీస్‌లో కాన్‌ఫ్లిక్ట్‌లో కనిపించింది.
జీ కర్దా వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. తమన్నా భాటియా, సుహైల్ నాయర్, ఆశీమ్ గులాటీ, అన్య సింగ్ తదితరులు నటించారు. ఈ సినిమాకు అనురిమ శర్మ దర్శకత్వం వహించారు. దినేష్ విజన్, ఆశీష్ నికమ్ నిర్మించారు. ఈ సినిమాకు సచిన్ జిగర్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 15వ తేదీన రిలీజ్ అవుతున్నది.