ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారూ సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎవరికి వారు ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుని దూసుకుపోతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఇద్దరు హీరోలు మధ్య ఇండస్ట్రీలో ఎంతో హెల్తీ పోటీ ఉంటుంది. ఒక హీరో సినిమా సృష్టించిన రికార్డులను మరో హీరో.. సినిమా బద్దలు కొట్టడం జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇండస్ట్రీలో ఎక్కువ పోలైట్ గా సైలెంట్ గా ఉండే హీరోలు కూడా ఇద్దరే అని అందరూ చర్చించుకుంటూ ఉంటారు. ఇక వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది. ఒకరికి అవసరమైనప్పుడు మరొకరు సహాయం చేయడం చేస్తూ ఉంటారు. అయితే ఈ ఇద్దరు హీరోల కాంబినేషన్లో ఒక మల్టీ స్టారర్ సినిమా పడితే చూడాలని అటు ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారూ అని చెప్పాలి. అయితే ఇప్పటికే జల్సా సినిమాకి మహేష్ బాబుతో వాయిస్ ఓవర్ చేపించిన త్రివిక్రమ్ ఇక వీరిద్దరి కాంబినేషన్ ఏమైనా సెట్ చేస్తాడేమో అని ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. కానీ ఈ కాంబినేషన్ సెట్ చేయడం అంత ఈజీ కాదు అని చెప్పాలి. కలలో కూడా ఊహించడం కష్టమైన ఈ కాంబినేషన్ గురించి 13 ఏళ్ల క్రితమే దర్శక ధీరుడు రాజమౌళి ఒక మాట అన్నాడు. ఇక ఇప్పుడు అందుకు సంబంధించిన ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. 2010 జూలై 12వ తేదీన రాజమౌళి ఒక ట్వీట్ పెట్టాడు. మహేష్ బాబు అండ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో సినిమా అనేది ఒక కల లాంటిది. ఆ కాంబినేషన్ కోరుకోవడం టూమచ్ అని అర్థం వచ్చేలా ట్విట్ చేశాడు ఇప్పుడు ఇది వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఈ కాంబినేషన్ సెట్ అవడం కాస్త కష్టమే.. అయినప్పటికీ రిపీట్ అయితే బాగుండు అని ఫ్యాన్స్ మాత్రం బలంగా కోరుకుంటున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: