రీసెంట్ టైమ్స్ లో యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది సిద్దు జొన్నలగడ్డ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.అయితే ఈ యంగ్ హీరో ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉన్నాడు.కానీ హీరోగా మాత్రం మంచి గుర్తింపును తెచ్చుకోలేకపోయాడు. ఇక గత ఏడాది విడుదలైన డిజే టిల్లు సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈయన. ఇక ఈ సినిమా కమర్షియల్ గా అతనికి పెద్ద బ్లాక్ బస్టర్ ఇవ్వడమే కాకుండా యూత్ లో ఆయనకి హీరోగా మంచి క్రేజ్ ని తెచ్చి పెట్టింది. 

సినిమా కంటే ముందు ఆయన గుంటూరు టాకీస్ వంటి సినిమాలు హీరోగా నటించాడు. కానీ ఆ సినిమాతో హీరోగా ఈయనకి మంచి గుర్తింపు మాత్రం రాలేదు. ఇక దాని తర్వాత లాక్ డౌన్ సమయంలో దగ్గుపాటి రానా నిర్మించిన కృష్ణ& హిస్ లీల సినిమాతో ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు ఈ యంగ్ హీరో. అయితే ఈ యంగ్ హీరో కేవలం హీరో మాత్రమే కాదు డైరెక్టర్ స్క్రిప్ట్ రైటర్ కూడా. గత ఏడాది వచ్చిన డీజే టిల్లు మరియు ఇప్పుడు దానికి వస్తున్న సీక్వెల్ స్క్వేర్ సినిమాలకు స్క్రిప్ట్ మరియు మాటలు అందించింది సిద్దు జొన్నలగడ్డ. ఇక ఇంత టాలెంటెడ్ కుర్రాడు హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఇన్నేళ్ల సమయం పట్టింది.

లేటుగా గుర్తింపు వచ్చినప్పటికీ డీజెటిల్లో సినిమాతో హీరోగా మంచి క్రేజీ సంపాదించుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ. అయితే ఇప్పుడు ఈ హీరోకి యూత్లో ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. ఆయన సినిమా చూసేందుకు థియేటర్ల బయట క్యూ కట్టేస్తున్నారు జనం. ఈ క్రమంలోనే ఆయన రెమ్యూనరేషన్ సైతం అమాంతం పెంచేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న టిల్లు స్క్వేర్ సినిమాకి ఏకంగా మూడు కోట్ల 50 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట ఈయన. అయితే ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం ఎంపికయ్యాడు ఈ యంగ్ హీరో. అయితే ఈ సినిమాలో నటించేందుకు నాలుగు కోట్లు డిమాండ్ చేస్తున్నాడుట సిద్దు జొన్నలగడ్డ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: