టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ బాయ్ గా అమ్మాయిల హృదయాలను దోచుకున్న మన్మధుడు విజయ్ దేవరకొండ. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన విజయ్ అదే సమయంలో అమ్మాయిలను, ప్రేక్షకులను కూడా తన వైపు మలుపుకున్నాడు.చూడ్డానికి మంచి హ్యాండ్సమ్ గా, అందంగా ఉంటూ నిత్యం ట్రెండీగా కనిపిస్తూ ఉంటాడు. అయితే ఇతగాడు ఏ హీరోయిన్ ను కూడా వదలడు అని టాక్ నడుస్తుంది. ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.మొదట్లో చిన్న చిన్న పాత్రలతో మెప్పించిన విజయ్ దేవరకొండ.. 2016 లో పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఇక ఆ సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న విజయ్ ఆ తర్వాత నటించిన ద్వారక సినిమా లో అంత సక్సెస్ పొందలేకపోయాడు. కానీ ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా తో బాక్సాఫీస్ వద్ద మంచి రికార్డు సొంతం చేసుకున్నాడు.

అర్జున్ రెడ్డి సినిమాతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత కూడా పలు సినిమాలలో నటించగా.. అంతగా సక్సెస్ కాలేకపోయాడు. ఇక పూరి జగన్నాద్ దర్శకత్వంలో రూపొందిన్న లైగర్ సినిమాలో నటించగా ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం సమంతతో ఖుషి సినిమాలో నటిస్తున్నాడు. అంతేకాకుండా ఆ మధ్యనే ఒక సినిమాకు ఓకే చేయగా అందులో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది.ఇక తాజాగా మరో సినిమాకు ఓకే చేయగా అందులో మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఇదంతా పక్కన పెడితే.. మామూలుగా అమ్మాయిలే కాదు హీరోయిన్స్ కూడా విజయ్ దేవరకొండ అంటే బాగా లైక్ చేస్తూ ఉంటారు. అతనితో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అని బాగా ఆశ పడుతుంటారు. నిజానికి విజయ్ అంత పెద్ద స్టార్ హీరో కాకపోయినా కూడా హీరోయిన్లు మాత్రం ఇతనిపై బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.గతంలో కొంతమంది హీరోయిన్స్ కూడా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పుడు.. క్రష్ ఎవరు, డేటింగ్ ఎవరితో చేయాలని ఉందని ప్రశ్నలు ఎదురవ్వగా వెంటనే విజయ్ దేవరకొండ పేరే చెప్పారు. విజయ్ అందగాడే కాకుండా ఏ విషయమైనా మొహమాటం పడకుండా నేరుగా చెప్పేస్తుంటాడు కాబట్టి అతనిని అమ్మాయిలు ఇష్టపడుతూ ఉంటారు.

కానీ కొందరు జనాలు మాత్రం ఇతడిని పెద్ద రసికుడు అని అనుకుంటారు. ఈయనతో ఎవరైనా హీరోయిన్ లు నటిస్తే చాలు వాళ్ళు కచ్చితంగా అతని మోజులో పడతారు అని అంటుంటారు. అలా గతంలో రష్మిక మందన్న ను లైన్లోకి దింపాడు అని కొందరు అనుమానం పడ్డారు. ఇక ఖుషి సినిమాలో తనతో పాటు నటిస్తున్న సమంతతో కూడా బాగా క్లోజ్ గా మూవ్ అవుతూ కనిపిస్తున్నాడు.గతంలో సోషల్ మీడియాలో వారికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వటంతో చాలామంది రకరకాలుగా కామెంట్లు పెట్టారు. అంతలోనే శ్రీలీలతో దిగిన ఫోటోలను కూడా పంచుకున్నాడు విజయ్. ఆ సమయంలో కూడా అతనితో జాగ్రత్తగా ఉండాలి అంటూ శ్రీ లీలకు సలహాలు ఇచ్చారు. అయితే తాజాగా మృనాల్ తో దిగిన ఫోటోలు కూడా పంచుకోగా తనకి కూడా జాగ్రత్తలు చెబుతున్నారు. విజయ్ తో కేరింగ్ గా ఉండాలి అని.. లేదంటే మిమ్మల్ని మాయ చేసేస్తాడు అని కామెంట్స్ పెడుతున్నారు. దీంతో మరికొంతమంది ఇవన్నీ చూసి.. విజయ్ దేవరకొండ అంత రొమాంటిక్ యాంగిల్ ఉందా ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: