టాలీవుడ్ యంగ్ హీరోలుగా కొనసాగుతున్న అక్కినేని నాగచైతన్య మరియు అఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే వీరిద్దరూ ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా సొంత అన్నదమ్ముల కలిసిమెలిసి ఉంటారు. నాగార్జున సతీమణి అమల సైతం అఖిల్ తో సమానంగా నాగచైతన్యను చూసుకుంటుంది. అయితే తాజాగా అమల ఈ అన్నదమ్ముల గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ ను చేసింది. దీంతో ఆమె చేసిన కామెంట్స్ ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఆ మారాయి. అయితే తాజాగా అమల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఎన్నో

 ఇంట్రెస్టింగ్ విషయాలను ఆ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకువచ్చింది. ఈ క్రమంలోనే ఆమె అఖిల్ గురించి మాట్లాడుతూ.. అతనికి మనుషులంటే చాలా ఇష్టమని పీపుల్ లవింగ్ పర్సన్ అని చెప్పకు వచ్చింది. నాగచైతన్య గురించి మాట్లాడుతూ.. అఖిల్ కంటే ఎక్కువగా చైతు గురించి మాట్లాడింది. చైతు చాలా తెలివైనవాడు అని.. చాలా ధైర్యవంతుడు అంటూ పేర్కొంది. అలాగే నాగచైతన్య తనకు ఏం కావాలో చాలా క్లారిటీగా ఉంటాడు అని.. కెరియర్ పట్ల చేసే పని పట్ల చాలా ఫోకస్ గా ఉంటాడు.. అంటూ చెప్పుకొచ్చింది అమల. దీంతో ఇద్దరు కొడుకుల పై అమల

 చేసిన కామెంట్స్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే మొత్తానికి చైతు అఖిల్ ల మధ్య చాలా తేడా ఉందని  అమలా మాట్లాడిన మాటల్లోనే అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ అన్నదమ్ములిద్దరూ సరైన హిట్ లేక సతమతమవుతున్నారు. ఇటీవల అఖిల్ ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక నాగచైతన్య సైతం కస్టడీ సినిమాతో ఇటీవల ప్రేక్షకులు ముందుకు రావడం జరిగింది.కానీ ఇద్దరు అన్నదమ్ములు నటించిన ఈ రెండు సినిమాలు కూడా ఊహించిన విధంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.దీంతో వీరిద్దరూ తమ నెక్స్ట్ ప్రాజెక్టుపై ఫుల్ ఫోకస్ పెట్టి ఎలాగైనా హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: