సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ తాజాగా మొదలైంది శంకరపల్లి లో ప్రత్యేకంగా వేసిన సెట్లో ఈ సినిమా షూటింగ్ మొదలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో తెరకెక్కించిన రెండు షెడ్యూల్ షూటింగ్ పూర్తి గా పక్కన పెట్టి మరల రీ ఫ్రెష్ గా స్క్రిప్ట్ ని త్రివిక్రమ్ రాసి షూటింగ్ మొదలుపెట్టినట్లుగా సమాచారం. అయితే ఈ చిత్రంలో శ్రీ లీల మెయిన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం మీనాక్షి చౌదరిని ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్ బ్యానర్ పైన నిర్మిస్తూ ఉన్నారు. తాజాగా గుంటూరు కారం సినిమా షూటింగ్ నిన్నటి రోజున మొదలైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి గతంలో కూడా ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పుడు మహేష్ బాబు ఫోటోలు కొన్ని లీక్ అయ్యాయి. తాజాగా శంకరం పల్లి లో జరుగుతున్న షూటింగ్ లొకేషన్లో మహేష్ బాబు చిన్నప్పటి ఫోటోలు అలాగే శ్రీ లీల మహేష్ బాబు కలిసి ఉన్న ఫోటో లీక్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


ఈ రెండు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉండడంతో సెట్స్ ఇక్కడ వేసిన షూటింగ్ గుంటూరు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మహేష్ బాబు కెరియర్ లో కంప్లీట్ యాక్షన్ చిత్రంగా ఈ సినిమా రాబోతోంది.ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. గుంటూరు కారం సినిమా ఎంత వీలైతే అంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి సినిమా మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. నెక్స్ట్ షెడ్యూల్ జూలై నెలలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా గుంటూరు కారం సినిమా పైన పలు రకాల రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: