టాలీవుడ్ లో యంగ్ హీరో శ్రీ విష్ణు ఎప్పుడు కూడా సీరియస్ సినిమాలతోనే ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటారు.. అయితే ఈసారి ట్రాక్ మార్చి పూర్తిగా కామెడీ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకుల ముందుకి రావడం జరిగింది. ఆచిత్రమే సామజవారగమన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో శ్రీవిష్ణు ఎంతవరకు సక్సెస్ అయ్యారు ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
(శ్రీ విష్ణు) ఇందులో బాలసుబ్రహ్మణ్యం గా కనిపిస్తారు. థియేటర్లో టికెట్లు ఇచ్చే జాబ్ చేస్తూ ఉంటారు ఆయన జీతం మీదే కుటుంబం మొత్తం ఆదారి పడి ఉంటుందట.. ఎన్నో వందల కోట్ల ఆస్తి ఉన్న బాలు తండ్రి..(నరేష్) డిగ్రీ పాస్ కాని కారణంగా కుటుంబం నుంచి దూరంగా ఉంటారు.. తనకు ఐ లవ్ యు చెప్పిన అమ్మాయిలతో రాఖీ కట్టించుకొని బాలు.. హీరోయిన్ రెబ్బ జాన్(సరయు )తో అనుకోని పరిస్థితుల్లో ప్రేమలో పడడం జరుగుతుందట.కానీ సరయు తండ్రికి ప్రేమ పెళ్లి అంటే అసలు ఇష్టం ఉండదు. ఈ సందర్భంగా బాలు తన ప్రేమను ఎలా సంపాదించారు అనే కథ అంశంతో మిగిలిన సినిమా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే విధంగా ఈ సినిమా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హాయిగా నవ్వుకునే సినిమా చూసి చాలా రోజులు అవుతున్నవారు కచ్చితంగా ఈ సినిమా ఆ లోటును తీరుస్తోందని ప్రేక్షకులు తెలియజేస్తున్నారు.. టైటిల్ కార్డు నుంచి ఎండ్ కార్డు వరకు ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేలా కనిపిస్తోంది.. రొటీన్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అయినా ఇందులో ఒక కొత్త పాయింట్ గురించి చర్చించారు డైరెక్టర్ రామ్ అబ్బరాజు.. ఇంటర్వెల్ వరకు బ్రేకుల్లేని బండిలో ఈ సినిమా కామెడీతో దూసుకుపోతుంది సెకండ్ హాఫ్ కూడా ఎంటర్టైన్మెంట్ ఎక్కడ వదలకుండా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా వెన్నెల కిషోర్ కామెడీ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ డోస్ సినిమా అని చెప్పవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి