ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. మెగా కుటుంబం నుంచి హీరోగా పరిచయమైన అల్లు అర్జున్ ప్రస్తుతం తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. తన నటనతో డాన్స్ లతో ఇక టాలీవుడ్ ప్రేక్షకులందరికీ కూడా స్టైలిష్ స్టార్ గా మారిపోయాడు అని చెప్పాలి. ఇక ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన  పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ హిట్ కొట్టి ఇక అందరికీ ఐకానిక్ star గా పరిచయం అయ్యాడు అల్లు అర్జున్.. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు అని చెప్పాలి.


 అయితే అల్లు అర్జున్ అటు సినిమాల కోసం ఎంతగానో కష్టపడుతూ ఇక తన కెరీర్ కు ఎంతలా ఇంపార్టెన్స్ ఇస్తాడో.. అదే సమయంలో ఫ్యామిలీకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాడు అనడంలో అతిశయోక్తి లేదు  తన పిల్లలు భార్యతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటాడు. ఖాళీ సమయం దొరికింది అంటే ఇక కుటుంబంతో కలిసి టూర్ వెళ్లడం చేస్తూ ఉంటాడు అల్లు అర్జున్. అయితే అల్లుఅర్జున్ స్నేహారెడ్డిని పెళ్లి చేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. కాగా అల్లు అర్జున్, స్నేహారెడ్డిని పెళ్లి చేసుకున్న సమయంలో భారీగానే కట్నం తీసుకున్నాడు అంటూ ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి.


 అయితే ఇదే విషయం గురించి అల్లు అర్జున్ మామగారు ఇటీవలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముందుగా బన్నీ, స్నేహ ప్రేమించుకున్నారు. అయితే అల్లు అర్జున్ ఫ్యామిలీ ఒప్పుకున్నప్పటికీ స్నేహ ఫ్యామిలీ మాత్రం ముందుగా ఒప్పుకోలేదట. కానీ అతి కష్టం మీద అల్లు అర్జున్ వారిని ఒప్పించారట. అయితే పెళ్లి సమయంలో అల్లు అర్జున్ ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోలేదట. ఇటీవలే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. అల్లు అర్జున్ చాలా మంచివాడు. మంచి యాక్టర్. అతను వివాహ సమయంలో ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. నేను ఇచ్చే కట్నం కూడా వారికి సరితూగదు. ఆయన మా ఇంటికి అల్లుడు కావడమే నాకు గర్వంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: