బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఆఖరుగా పఠాన్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్ లను కూడా వసూలు చేసి ఈ సంవత్సరం హిందీ సినీ పరిశ్రమలో భారీ బ్లాక్ బస్టర్ విజయాలను సాధించిన మూవీ ల లిస్ట్ లో చేరిపోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ హీరో జవాన్ అనే మరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.

ఈ సినిమాలో షారుక్ సరసన నయన తార హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి అట్లీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రియమణి ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమై ఇప్పటికే చాలా కాలం అవుతుంది. అలాగే ఈ మూవీ కి సంబంధించిన చాలా భాగం షూటింగ్ ఇప్పటికే పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ యొక్క టీజర్ ను జూలై 7 వ తేదీన విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క మ్యూజిక్ హక్కులను ప్రముఖ ఆడియో సంస్థలలో ఒకటి అయినటువంటి టి సిరీస్ సంస్థ 36 కోట్ల భారీ గేయంతో కొనుగోలు చేసినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.  ఈ మూవీపై హిందీ ... తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో విజయ్ సేతుపతి ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: