ప్రభాస్ తాజాగా నటించిన ఆది పురుష్ సినిమా ఇటీవల విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిరాశపరిచింది అని చెప్పాలి. దాంతోపాటు కథ పరంగా  కూడా రామాయణానికి పూర్తి విభిన్నంగా ఈ సినిమా ఉంది అని చాలా విమర్శల పాలయింది ఈ సినిమ అయితే ప్రభాస్ పోస్టర్ విడుదలైనప్పటినుండి ఈ సినిమా ఏదో ఒక విమర్శలకు గురవుతూనే ఉంది. ఇక రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాపై ఏ రేంజ్ లో విమర్శలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

హిందూ సంఘాలు ఈ సినిమాపై హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఇక ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రభాస్ కి ఉన్న క్రేజ్ తో ఈ సినిమాకి భారీ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయి. త్వరలోనే ఈ సినిమా ఓటీటి లోకి కూడా వచ్చేస్తుందని తెలుస్తోంది. అయితే జులై చివరి వారంలో ఈ సినిమా ఓటీటిలోకి తీసుకురావాలని అనుకున్నారు దర్శక నిర్మాతలు. అయితే థియేటర్స్ లో రోజురోజుకి ఈ సినిమా కలెక్షన్స్ తగ్గిపోవడంతో ముందుగానే ఈ సినిమాని ఓటీటిలోకి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట .

సినిమా అనుకున్న దానికంటే ముందుగానే వస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాని ముందు జూలై చివరి వారంలో లేదా ఆగస్టులో ఓటిటిలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు దాని కంటే ముందుగానే ఓటిటిలో విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే థియేటర్స్ లో ఉండగానే ఈ సినిమా పైరసీ రూపంలో బయటకు రావడం జరిగింది. తమిళ్ వర్షన్ లో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఈ సినిమా. దాంతో ఈ సినిమాను తెలుగులో సైతం ఓటీటిలో త్వరగా విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది .మరో వాదం రోజుల్లో ఈ సినిమా ఓటీటిలో వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ వార్తపై చిత్రబృందం అధికారిక ప్రకటన కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయట..!!

మరింత సమాచారం తెలుసుకోండి: