ఈ మధ్యకాలంలో ఎక్కువగా చిన్న సినిమాలు మంచి సక్సెస్ అందుకుంటున్నాయి. ముఖ్యంగా ఇలాంటి సినిమాలను సైతం స్టార్ హీరోలు సైతం చూసి మెచ్చుకోవడంతో మరింత పాపులారిటీ సంపాదిస్తున్నాయని చెప్పవచ్చు. తాజాగా యంగ్ హీరో శ్రీ విష్ణు ఇటీవలే సామజవరగమన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్గా ఈ సినిమాని తెరకెక్కించారు. వరుస ప్లాపులతో ఇబ్బంది పడుతున్న శ్రీ విష్ణు ఈ సినిమాతో హిట్ కొట్టడమే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా లాభాల బాటను పట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా విడుదలై మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.


చిన్న బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా భారీగానే రాబడుతున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ రామ్ అబ్బరాజు ఈ సినిమాని దర్శకత్వం వహించారు జూన్ 29 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని కామెడీ సన్నివేశాలు కూడా టైమింగ్  ప్రేక్షకులను బాగానే ఆకట్టుకునేలా చేసింది. ఇందులో వెన్నెల కిషోర్ పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తోందని అలాగే శ్రీ విష్ణు పర్ఫామెన్స్ నరేష్ కామెడీ టైమింగ్ హీరోయిన్ రెబ్బ మౌనిక నటనపరంగా ప్రశంసలు అందుకుంటున్నారు.



ఇక సామజవరగమన చిత్రం టాలీవుడ్ నుంచి అతిపెద్ద విజయం అయిన కథలను ఒకటిగా నిలిచిందని తెలుస్తోంది ఈ సినిమా యొక్క ఓవర్సీస్ హక్కులను రూ.25-30 లక్షల రూపాయలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది ఈ సినిమాలోని ఏకంగా నిన్నటి రోజున  రూ.82 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో అతి త్వరలోనే ఈ సినిమా ఫుల్ రన్ టైంలో వన్ మిలియన్ మార్కును కూడా అధిగమించే అవకాశం ఉన్నట్లు సినీ విశ్లేషకులు సైతం తెలియజేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్లు ఏ విధంగా ఉంటాయో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: