టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది సమంత. అనంతరం హీరో నాగ చైతన్య నీ పెళ్లి చేసుకుని విడాకులు కూడా తీసుకుంది. అయితే తాజాగా ఇప్పుడు నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ వీరిద్దరూ ఒకే గూటికి చేరారా అంటే అవునని సమాధానం వినిపిస్తోంది.అయితే ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసింది. వీళ్ళ పెళ్లి సమయంలో ఎంత హంగామా జరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచంలో వీళ్లే పెళ్లి చేసుకున్నారు అంత ఘనంగా అంత సంతోషంగా ధూంధాం గా పెళ్లి చేసుకున్నారు ఈ జంట. 

కట్ చేస్తే పట్టమని పదేళ్లు కూడా కలిసి ఉండకుండానే విడాకులు తీసుకున్నారు. దాని తర్వాత ఎవరిదానివారు చూసుకుని ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఇద్దరు బిజీగా మారారు. అయితే విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్యకు అస్సలు కలిసి రావడం లేదు అని చెప్పాలి. బంగార్రాజు సినిమా తప్పిస్తే ఆయన నటించిన ఏ సినిమా హిట్ అవ్వలేదు. ఆ సినిమా చేసిన కూడా ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది. అయితే బంగార్రాజు సినిమా హిట్ అవ్వడానికి ముఖ్య కారణం నాగార్జున అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే విడాకుల తరువాత సమంతకి కూడా అస్సలు కలిసి రావడం లేదు.

ఒకటి రెండు సినిమాలు తప్పిస్తే ఈమె నటించిన సినిమా లు పెద్దగా ఆమెకి హిట్ తెచ్చి పెట్టలేదు. ఊ అంటావా మావ పాట పుణ్యమా అని ఈమె పేరు పాన్ ఇండియా లెవెల్ లో మారుమ్రోగింది. అయితే సమంత ఇటీవల సినిమాలకి గుడ్ బై సైతం చెప్పింది అన్న వార్తలు వస్తున్నాయి. పిఆర్ టీమ్ సమంత సుదీర్ఘంగా బ్రేక్ తీసుకోవాలని అనుకుంటుంది అంటూ దానిపై క్లారిటీ సైతం ఇచ్చారు. అయితే నాగచైతన్య ఇప్పుడు వరకు ఒక సినిమా కూడా కమిట్ అవ్వలేదు. ఈ రకంగా చూసుకుంటే వీరిద్దరూ కూడా విడాకుల తర్వాత వీరిద్దరి టైం అసలు కలిసి రావడం లేదని చెప్పాలి. మొత్తానికి విడాకులు తీసుకున్న తర్వాత వీరిద్దరూ ఒకే గూటికి చేరుకున్నారు అని చెప్పాలి. సినిమాల అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు ఈ మాజీ భార్య భర్తలు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: