ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న హీరోలలో మాస్ మహారాజా ముందు వరుసలో ఉంటారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మొదట అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరియర్ ని ప్రారంభించాడు రవితేజ. దాని తరువాత చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ హీరోగా అడపా దడపా సినిమాల్లో నటించాడు. ఇక అలా కొన్ని రోజులు నెట్టుకొచ్చాడు రవితేజ. దాని తర్వాత ఇడియట్ అనే సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని కొట్టి స్టార్ హీరోగా స్థిరపడ్డాడు. ఇక ఈ సినిమా తర్వాత ఆయన శని కెరియర్లో ఎన్నో 

హిట్ సినిమాలలో నటించాడు రవితేజ. హిట్ సినిమాలే కాకుండా సూపర్ హిట్ లు బ్లాక్ బస్టర్ హిట్లని తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్థాయి నుండి ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోల లిస్టులో చేరాడు రవితేజ. అయితే రవితేజ సినీ ప్రయాణం చాలా మందికి ఆదర్శప్రాయం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఐతే సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎంత పెద్ద స్టార్ హీరోకి ఆయన రూమర్స్ రావడం అన్నది చాలా కామన్. అయితే రవితేజ మీద కూడా అప్పట్లో చాలా రూమర్స్ వచ్చాయి. అదేంటంటే ఆయన ప్రముఖ స్టార్ హీరోయిన్ అనుష్కతో డేటింగ్ చేస్తున్నారని..

అంతే కాదు వీళ్ళిద్దరూ ముంబైలోని ఒక ప్రముఖ రిసార్ట్ లో ఉంటూ కెమెరా కంట పడ్డారు అంటూ అప్పట్లో ఏ రేంజ్ లో వార్తలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ రోమన్ అప్పట్లో బాగా వ్యాప్తి చెందడంతో రవితేజ ఇంట్లో కూడా దీనిమీద చాలాసార్లు గొడవలు జరిగాయి అని అన్నారు. అయితే ఈ రేంజ్ లో రూమర్ వ్యాప్తి చెందడానికి కారణం రవితేజ ఒక ఇంటర్వ్యూలో భాగంగా తనకి ఇష్టమైన హీరోయిన్ ఎవరు అని అడగగా దానికి సమాధానం గా అనుష్క పేరుని చెప్పాడు రవితేజ. అంతే కాకుండా అనుష్క తనకి ఎంతో మంచి స్నేహితురాలు అని నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అని కూడా రవితేజ పేర్కొన్నారు. ఇక అక్కడి నుండి మొదలైన రచ్చ ఇంటి వరకు తీసుకెళ్లింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: