ఇక తన కెరీర్ లో తనకు కలిసి వచ్చిన ఐటమ్స్ సాంగ్స్ తోనే ఇప్పుడు టాలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి ఇక్కడ ఆవా నడిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ ఇస్ ద పార్టీ అనే ఒక స్పెషల్ సాంగ్ చేసింది ఊర్వశి. ఇక ఈ పాటతో టాలీవుడ్ గడ్డపై కూడా అడుగు పెట్టింది అని చెప్పాలి. ఇక తన అందం అభినయంతో ఒక ఊపు ఊపేసింది. ఏకంగా చిరంజీవి గ్రేస్ ను మ్యాచ్ చేస్తూ డాన్స్ ఇరగదీసింది అని చెప్పాలి. దీంతో ఇక ఇప్పుడు ఎవరైనా హీరో సినిమాలో ఐటెం సాంగ్ అంటే చాలు దర్శక నిర్మాతలు అందరూ కూడా ముందుగా ఊర్వశీ రతౌలా వైపే చూస్తున్నారు.
వాల్తేరు వీరయ్య తర్వాత అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ మూవీలో వైల్డ్ సాలా అనే సాంగ్ తో మెరిసింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ ఇక ఐటమ్ సాంగ్ మాత్రం బాగా హిట్ అయింది అని చెప్పాలి. ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో వస్తున్న బ్రో మూవీలో కూడా సందడి చేయబోతుంది. అదే సమయంలో ఇక రామ్ పోతినేని- బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న సినిమాలో కూడా ఛాన్స్ దక్కించుకుంది. ఇక అల్లు అర్జున్ పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ చేయబోతుంది. అయితే ఇప్పుడు ఈ అమ్మడికి బాగా డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో.. రెమ్యూనరేషన్ కూడా ఒక్కసారిగా పెంచేసింది. ఏకంగా నిమిషానికి కోటి ఛార్జ్ చేస్తుందట ఈ ముద్దుగుమ్మ. పాట ఎన్ని నిమిషాలు ఉంటే అన్ని కోట్లు తీసుకుంటుందట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి