తన అందం ఉదయం తో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది అని చెప్పాలి. లాహిరి లాహిరి లాహిరిలో అనే సినిమాతో టాలీవుడ్లోకి హీరోయిన్గా అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన సింహాద్రి మూవీలో కూడా నటించింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో అంకిత ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ రేసులోకి వచ్చింది అని చెప్పాలి. ఇలా వరుసగా అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే ఇక సినిమాలను దూరం పెట్టేసింది. కథలతో డైరెక్టర్లు ఆమె దగ్గరికి వెళ్లిన నో చెబుతూ వచ్చింది.
అయితే సడన్గా అంకిత ఎందుకు సినిమాలకు దూరమయ్యారు అన్న విషయం మాత్రం అభిమానులకు అర్థం కాలేదు. మళ్లీ ఆమె సినిమాలు చేస్తారేమో అని ఎంతో ఆశగా ఎదురు చూశారు అభిమానులు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అంకిత తాను సినిమాలకు దూరం కావడానికి గల కారణాలు ఏంటి అన్న విషయాన్ని చెప్పుకొచ్చింది. తాను హీరోయిన్గా నటించిన విజయేంద్ర ప్రసాద్ సినిమా ఫ్లాప్ కావడంతోనే ఇక సినిమాలకు దూరం కావాలని నిర్ణయించుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఒకవేళ ఆ సినిమా హిట్ అయి ఉంటే సినిమాల్లో కొనసాగే దానిని అంటూ తెలిపింది. ఇక ఇప్పుడుఅవకాశాలు వస్తే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ చెబుతుంది హీరోయిన్ అంకిత.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి