ఇక బాలయ్య వంటి సీనియర్ హీరోలకు కూతురు పాత్రలో కూడా నటించేందుకు సిద్ధమయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇలాంటి సమయంలోనే శ్రీ లీల లేడీ ఓరియంటెడ్ చిత్రాలను కూడా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా హీరోయిన్స్ ఆఫర్లు లేని సమయంలోనే లేకపోతే స్టార్ గా ఒక స్థాయికి చేరుకున్న తరువాతనే ఇలాంటి సినిమాలు చేయడానికి కమిట్ అవుతూ ఉంటారు.కానీ ఈ ముద్దు గుమ్మ చిన్న వయసులోనే ఇలా లేడి ఓరియంటెడ్ సినిమాలను మొదలుపెట్టడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రముఖ ఫిలిం మేకర్ సింగీతం శ్రీనివాస దర్శకత్వంలో ఈమె ఈ సినిమా లో నటించబోతున్నట్లు సమాచారం
ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ అయితే జరుగుతున్నట్లు సమాచారం. ఒకవైపు స్టార్ హీరోల సినిమాలలో కమర్షియల్ హీరోయిన్ గా అందచందాలతో ఆరబోస్తూ దూసుకుపోతున్న శ్రీ లీల మేరీ ఓరియెంటెడ్ సినిమాను చేయడంతో అభిమానులు మిశ్రమంగా స్పందిస్తూ ఉన్నారు. హీరోయిన్ గా శ్రీలీల రాబోయే రోజులు స్టార్ డమ్ సొంతం చేసుకోవడానికి సంగీతం శ్రీనివాస్ సినిమా ఉపయోగపడే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు సినీ విశ్లేషకులు సైతం తెలియజేస్తున్నారు. మరి ఏ సినిమాలు ఈమెకు సక్సెస్ ని ఇస్తాయో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి