ఆమె మహేష్ కి అల్లోపతి చేశారట. బాడీలోని నరాలను రిలీజ్ చేయడం ద్వారా మైగ్రేన్ ని తొలగించారట. కేవలం రెండు మూడు నెలల్లో మిరాకిల్ గా ఆయనకు తలనొప్పి సమస్య పోయిందట. ఈ విషయాన్ని మహేష్ ఒక సందర్భంగా లో స్వయంగా చెప్పారు. మైగ్రేన్ వలె మహేష్ కి మరికొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయనే పుకార్లు ఉన్నాయి. ముఖ్యంగా ఆయనకు మోకాలి సర్జరీ జరిగిందంటారు.ఆ మధ్య విదేశాల్లో ఒక వైద్యుడిని కలిశాడు. అప్పట్లో అదే న్యూస్ అయ్యింది. ప్రత్యేకమైన వైద్యం కోసం ప్రపంచ ప్రసిద్ధ వైద్యుడిని కలిశారని వార్తలు వచ్చాయి. తాజాగా మహేష్ బాబు మరలా అమెరికా వెళ్లినట్లు సమాచారం. మహేష్ లేకపోవడంతో గుంటూరు కారం షూటింగ్ ఇతర నటులతో కొనసాగిస్తున్నారు. మహేష్ ఆకస్మిక ప్రయాణం వైద్యం కోసమే అనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఇక వచ్చే ఏడాది నుండి మహేష్ రాజమౌళి చిత్ర షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి