మెగాస్టార్ చిరంజీవి ఈ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి కానుకగా విడుదల అయినటువంటి వాల్తేర్ వీరయ్య మూవీ తో అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇలా ఇప్పటికే వాల్టేరు వీరయ్య మూవీ తో ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న చిరంజీవి ఈ సంవత్సరం భోళా శంకర్ మూవీ తో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భోళా శంకర్ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

మూవీ కి మెహర్ రమేష్ దర్శకత్వం వహించగా ... తమన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. సుశాంత్ ... కీర్తి సురేష్మూవీ లో కీలక పాత్రలలో కనిపించనుండగా ... ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకరమూవీ ని నిర్మించాడు. మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయింది  అలాగే ఈ మూవీ కి సంబంధించిన డబ్బింగ్ పనులను ఇప్పటికే చిరంజీవి ... తమన్నా పూర్తి చేసుకున్నారు. ఈ మూవీ ట్రైలర్ ను ఈ నెల 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పనులు చివరి దశకు  చేరడంతో చిరంజీవి తన తదుపరి మూవీ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో చిరంజీవి హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని యువి క్రియేషన్స్ బ్యానర్ వారు 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్త కనుక నిజం అయితే చిరంజీవి కెరియర్ లో ఇది మరో భారీ మూవీ అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: