సూపర్ స్టార్ రజనీ కాంత్ ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాల్లో నటిస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఆఖరుగా రజనీ కాంత్ "పెద్దన్న" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని సాధించ లేక పోయింది. ఇకపోతే తాజాగా రజిని "జైలర్" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయింది  ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్పీడ్ గా జరుగుతున్నాయి. తమన్నా ఈ సినిమాలో రజిని సరసన హీరోయిన్ గా నటించగా ... నెల్సన్ దిలీప్ కుమార్మూవీ కి దర్శకత్వం వహించాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని ఆగస్టు 10 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి ఈ మూవీ మేకర్స్ రెండు పాటలను విడుదల చేశారు. ఆ రెండు పాటలకు కూడా ప్రస్తుతం ప్రేక్షకుల నుండి సూపర్ క్రేజ్ లభిస్తుంది. 

ఇకపోతే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి థర్డ్ సింగిల్ విడుదలకు సంబంధించిన అధికారిక అనౌన్స్మెంట్ ఇచ్చింది. తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ మూవీ లోని థర్డ్ సింగిల్ అయినటు వంటి జూలై 26 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మరి ఇప్పటికే ఈ మూవీ లోని రెండు పాటలు కూడా ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో అలరించడంతో ఈ మూవీ మూడవ పాటపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: