మెగాస్టార్ చిరంజీవి కొంత కాలం క్రితమే వాల్తేరు వీరయ్య అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఇప్పటికే ఈ సంవత్సరం వాల్టేరు వీరయ్య మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న చిరంజీవి ఈ సంవత్సరం భోళా శంకర్ మూవీ తో మరో సారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాను ఆగస్టు 11 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించగా ... తమన్నా ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా కనిపించబోతుంది.

మూవీ తమిళ సినిమా అయినటువంటి వేదలం కు రీమేక్ గా రూపొందింది. సిస్టర్ సెంటిమెంట్ తో రూపొంది బ్లాక్ బస్టర్ విజయం సాధించిన వేదాళం సినిమాను చాలా సంవత్సరాల తర్వాత భోళా శంకర్ పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇకపోతే సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందుతున్న ఈ మూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ కనిపించబోతోంది. అలాగే ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో సుశాంత్ కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుండి పాటలను ... కొన్ని ప్రచార చిత్రాలను ఈ  మూవీ మేకర్స్ విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాను "యూ ఎస్ ఏ" లో భారీ ఎత్తున విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఈ సినిమాకు "యూ ఎస్ ఏ" లో ప్రీమియర్స్ ను కూడా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ కి కనక మంచి పాజిటివ్ టాక్ వచ్చినట్లు అయితే "యు ఎస్ ఏ" నుండి భారీ కలెక్షన్ లు కూడా వచ్చే అవకాశాలు బలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: