తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ షో హడావిడి మొదలైంది. ఇప్పటికే 6 సీజన్లు ఎంతో విజయవంతంగా పూర్తయ్యాయ్. ఇక కొన్ని కొన్ని సార్లు విమర్శలు వచ్చిన ఇక వాటిని దాటుకుంటూ బిగ్ బాస్ నిర్వాహకులు ముందుకు సాగుతూ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచుతూనే ఉన్నారు. ఇక ఇప్పుడు బిగ్బాస్ ఏడవ సీజన్ ప్రారంభానికి అంతా సిద్ధమైంది. అయితే హోస్ట్ గా నాగార్జున  తప్పుకుంటారు అని వార్తలు వచ్చినప్పటికీ.. ఇటీవల బిగ్ బాస్ ఏడో సీజన్ కు సంబంధించిన ప్రోమో విడుదలైన తర్వాత అందరికీ క్లారిటీ వచ్చింది  ఇక మరోసారి నాగార్జున బిగ్ బాస్ కు హోస్టింగ్ చేయబోతున్నాడు అని తెలిసిపోయింది.


 అయితే ఇక ఇప్పటికే బిగ్ బాస్ ఏడవ సీజన్ కు సంబంధించి ప్రోమో విడుదలైన నేపథ్యంలో ఈసారి హౌస్ లోకి వెళ్ళబోయే కంటెస్టెంట్స్  ఎవరు అన్న చర్చ మొదలైంది. ఇక ఎంతోమంది సినీ సెలబ్రిటీలు యూట్యూబర్ల పేర్లు తెరమీదకి వస్తున్నాయి అని చెప్పాలి. అయితే గత కొన్ని సీజన్ల నుంచి యూట్యూబ్ లో ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించుకుంటూ ఇక హాట్ టాపిక్ గా మారిపోయిన యూట్యూబర్లను హౌస్ లోకి పిలవడం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు అందరికీ సుపరిచితురాలుగా మారిపోయిన బ్యాంకాక్ పిల్లా శ్రావణి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతుందట. భర్త ఉద్యోగం లో భాగంగా బ్యాంకాక్ వెళ్లి స్థిరపడిన శ్రావణి.. సరదా కోసం బ్యాంకాక్ పిల్ల అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. ఈ క్రమంలోనే తెలుగులో వీడియోలు చేస్తూ లక్షల్లో సబ్స్క్రైబర్లను సొంతం చేసుకుంది.


 విజయనగరం యాసతో అందరికీ దగ్గర అయింది శ్రావణి. ఇక ఇప్పుడు ఆమె నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానల్ కు 20 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. అయితే ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి రాబోతుందని టాక్ వినిపిస్తుంది. ఈ షో కోసం నిర్వాహకులు ఇప్పటికే ఆమెను సంప్రదించారట. కుటుంబ సభ్యుల అభిప్రాయం అడిగి చెబుతానని శ్రావణి బిగ్ బాస్ నిర్వాహకులకు తెలిపిందట. అయితే ఇటీవల ఫ్యామిలీతో కలిసి శ్రావణి ఇండియాకు వచ్చింది. దీంతో బిగ్ బాస్ షో కోసమే ఇక్కడికి  వచ్చిందని ప్రచారం మొదలైంది. అయితే ఈ ప్రచారాన్ని శ్రావణి ఖండించకపోగా.. ఇండియా వచ్చిన మాట నిజమే అంటూ తన కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాను అంటూ చెప్పింది. దీంతో శ్రావణి బిగ్ బాస్ హౌస్ లోకి రావాలని అటు ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: