టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ల లో శేఖర్ మాస్టర్ ఒకరనే సంగతి తెలిసిందే. అయితే ఒక ఇంటర్వ్యూ లో శేఖర్ మాస్టర్ కు తక్కువ సమయం లో రిహార్సల్స్ చేసి సాంగ్ షూట్ లో పాల్గొని డ్యాన్స్ చేసే హీరో ఎవరనే ప్రశ్న ఎదురు కాగా జూనియర్ ఎన్టీఆర్ పేరు సమాధానం చెప్పారు. టాలీవుడ్ లో ఆ టాలెంట్ ఉన్నది జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రమేనని అతనే తోపు అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా షూట్ తో ప్రస్తుతం బిజీ గా ఉన్నారు.
దేవర మూవీ షూటింగ్ కు ముందే ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి ప్రకటన వెలువడింది. మరో 8 నెలల్లో ఈ సినిమా థియేటర్ల లో విడుదల కానుందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో యాక్షన్ సీన్లు ఊహించని స్థాయిలో ఉండనున్నాయని ఈ సినిమాలో తీవ్రస్థాయిలో రక్తపాతానికి సంబంధించిన సీన్లు ఉండనున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి.
దేవర సినిమా జాన్వీ కపూర్ కెరీర్ ను మలుపు తిప్పనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. దేవర సినిమా తారక్ కోరుకున్న మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందించాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా షూట్ పూర్తైన తర్వాతే కొత్త సినిమాల షూటింగ్ లో పాల్గొననున్నారని భోగట్టా. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా సోషల్ మీడియాపై తారక్ మరింత దృష్టి పెట్టాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి