మరి ఆ వివరాల్లోకి వెళితే.. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఆ దర్శకుడికి బన్నీ నో చెప్పారట. ఆయన ఎవరో కాదు. బడా డెరెక్టర్ ఆధిత్య ధర్.ఆయన దర్శకత్వంలో బన్నీ ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ అనే సినిమా చేయాల్సి ఉంది. ఇది ఆ డెరెక్టర్ డ్రీమ్ ప్రాజెక్టు. ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ సినిమాను జియో స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనుంది.ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా ఎంపిక అయ్యారు. త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ సినిమాకు బన్నీ నో చెప్పారట. దానికి కారణం ప్రభాస్ అని తెలుస్తోంది. ప్రభాస్ కూడా ఈ మధ్య బాలీవుడ్ దర్శకులతో సినిమాలు తీయకూడదని నిర్ణయం తీసుకున్నారట. ఆది పురుష్ దెబ్బకు ప్రభాస్..బాలీవుడ్ దర్శకులకు నో చెప్పారని తెలుస్తోంది. అలా ప్రభాస్ బాటలోనే బన్నీ కూడా వెళ్తున్నారనే కామెంట్స్ వస్తున్నాయి. ఒక్క ఓం రౌత్ చేసిన పనికి బాలీవుడ్ దర్శకులకు ఛాన్స్ లు ఇవ్వకపోవడం ఏంటనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి