టాలీవుడ్ యువ నటుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఆఖరుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన కామెడీ ప్లస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఎఫ్ 3 లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో వరుణ్ తో పాటు విక్టరీ వెంకటేష్ కూడా హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అని రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇలా ఎఫ్ 3 మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించిన ఈ నటుడు ప్రస్తుతం గాంధీవదార అర్జున అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. సాక్షా వైద్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కి ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహిస్తున్నాడు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను ఆగస్టు 25 వ తేదీన థియేటర్ లలో విడుదల చేనున్నారు. 

ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా ట్రైలర్ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఒక ప్రత్యేకమైన వీడియోను విడుదల చేస్తూ ఈ మూవీ యొక్క ట్రైలర్ ను ఆగస్టు 10 వ తేదీన ఐమాక్స్ బిగ్ స్క్రీన్ లో మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే. ఈ మూవీ ట్రైలర్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: