ఒకవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు అని చెప్పాలి. అయితే టాలీవుడ్ లో ఈ రేంజ్ లో క్రేజ్ సంపాదించిన పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం వస్తే వదులుకోవడానికి ఏ హీరోయిన్ కూడా ఇష్టపడదు. అంతేకాదు ఎప్పుడెప్పుడు పవర్ స్టార్ సినిమాలో ఛాన్స్ వస్తుందా అని ఎదురు చూసే హీరోయిన్లు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఒక్క హీరోయిన్ మాత్రం ఏకంగా పవన్ కళ్యాణ్ హిట్ మూవీలో ఛాన్స్ వస్తే రిజెక్ట్ చేసిందట. ఆ హీరోయిన్ ఎవరో కాదు నయనతార. సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్న నయనతార.. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ అనే సినిమాలో నయనతార కు ఛాన్స్ వచ్చిందట.
ఈ సినిమాలో ముందుగా నయనతారనే సెలెక్ట్ చేశారట. అయితే ఇలా పవన్ మూవీ ఆఫర్ వచ్చిన సమయంలో నయన్ మేకర్స్ కి ఒక కండిషన్ పెట్టిందట. పవన్ పాత్రతో సమానంగానే తన పాత్ర కూడా డిజైన్ చేయమని డిమాండ్ చేసిందట. కానీ అలా చేస్తే ఆడియన్స్ అంగీకరించరు అని మేకర్స్ కూడా ఒప్పుకోలేదట. దీంతో నయన్ ఇక సినిమా నుంచి తప్పుకుందట. దీంతో ఆమె ప్లేసులో హీరోయిన్ అంజలిని తీసుకున్నారు. ఈ విషయం తెలిసి నయన్ కంటే అంజలిని ఆ పాత్రకు 100% న్యాయం చేసిందంటూ పవన్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. నయన్ మొండి పట్టుతో మంచి ఛాన్స్ ని కోల్పోయింది అంటూ కామెంట్ చేస్తూ ఉండటం గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి