ఇక ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. పవర్ స్టార్ రాజకీయ భవితవ్యం ఎలా ఉండబోతుంది అని యాంకర్ ప్రశ్నిస్తే సంచలన వ్యాఖ్యలు చేశాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ఒక సూపర్ స్టార్ అంటూ మంచు విష్ణు ప్రశంసలు కురిపించాడు. అయితే పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటూ తెలిపాడు. ఇక సినిమాల పరంగా ఆయన పవర్ ఏంటో ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అంటూ ఇంటర్వ్యూలో కామెంట్ చేశాడు మంచు విష్ణు. అయితే పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లో విజయం సాధిస్తారా అని ప్రశ్నిస్తే మాత్రం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో విజయం సాధిస్తారో లేదో అని ముందుగానే చెప్పడానికి నేనేమీ బ్రహ్మంగారిని కాదు కదా అంటూ సెటైర్ వేశాడు మంచు విష్ణు. సినిమా పరంగా మాత్రం పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి చెప్పగలను. ఎందుకంటే ఒక సినిమా ఆడక పోయిన.. తర్వాత పవన్ నటించిన తర్వాత సినిమాకి భారీ రేంజ్ లోనే కలెక్షన్స్ వస్తాయి అంటూ మంచు విష్ణు కామెంట్ చేశాడు. ఇకపోతే పవర్ స్టార్ విషయానికి వస్తే ఒక వైపు సినిమాలను మరోవైపు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఒకవైపు అటు వారాహి యాత్రలో పాల్గొంటూనే ఇంకోవైపు సినిమాలతో సూపర్ హిట్ లు కూడా కొడుతున్నాడు పవన్ కళ్యాణ్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి