చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి ఇక ఆ తర్వాత హీరోయిన్లుగా మారిన వారిలో సీనియర్ హీరోయిన్ రాసి కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు. ఇక ఒకానొక సమయంలో పదుల సంఖ్యలో సినిమాలు చేసి బిజీ హీరోయిన్గా కొనసాగారు. ఇక స్టార్ హీరోయిన్గా కొన్నాళ్లపాటు హవా నడిపించారు. అయితే ఆ తర్వాత కాలంలో ఇండస్ట్రీకి దూరమయ్యారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ధారావాహికల ద్వారా మళ్ళీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు రాసి. జానకి కలగనలేదు అనే సీరియల్లో హుందాతనంతో కూడిన ఒక అత్తయ్య పాత్రలో నటిస్తూ మళ్లీ ప్రేక్షకులకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.



 అయితే జానకి కలగనలేదు అనే సీరియల్ ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సీనియర్ హీరోయిన్ రాసి తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు టాలీవుడ్ హీరోలు శోభన్ బాబు మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది ఈ సీనియర్ హీరోయిన్. అయితే నేటి జనరేషన్లో తనకు ఫేవరెట్ హీరో మాత్రం ప్రభాస్ అంటూ తెలిపింది. ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం. ఒకవేళ అవకాశం వస్తే ప్రభాస్ తో కలిసి నటించడానికి ఎదురుచూస్తున్న అంటూ చెప్పుకొచ్చింది.


 అయితే ప్రభాస్ సినిమాలో ఏ పాత్ర వచ్చినా చేస్తాను. కానీ ఇక ప్రభాస్కు తల్లిగా నటించే పాత్ర వస్తే మాత్రం అస్సలు చేయను అంటూ చెప్పేస్తుంది. అయితే ఇప్పటివరకు ప్రభాస్ ని ఒక్కసారి కూడా కలవలేదని చెప్పుకొచ్చింది. అయితే ప్రభాస్ హీరోగా వచ్చిన అడవి రాముడు షూటింగ్ సమయంలో మాత్రం నేను ఉన్న హోటల్లోనే ప్రభాస్ కూడా ఉన్నారు. అయితే ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేశాను అంటూ తెలిపింది. అయితే రాసి చివరగా లంక అనే సినిమాలో నటించింది. సైకలాజికల్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో రాశి ప్రధాన పాత్రలో నటించగా ఈ సినిమా పెద్దగా ప్రేక్షకాధరణకు నోచుకోలేదు. కాగా రాసి శ్రీముని అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: