సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత 'విరూపాక్ష' మూవీతో రీఎంట్రీ ఇచ్చాడు. ఇది సంచలన విజయాన్ని నమోదు చేసుకోవడంతో పాటు కలెక్షన్ల పరంగా దుమ్ము దులిపేసింది. అయితే, దీని తర్వాత అతడు నటించిన 'బ్రో' మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల స్పందనను అందుకోలేకపోయింది. ఫలితంగా సాయి తేజ్‌కు నిరాశే ఎదురైంది.వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న సాయి ధరమ్ తేజ్ ఇటీవలే 'సత్య' 'The Soul Of Satya' అనే కవర్ సాంగ్‌తో వచ్చాడు. ప్రముఖ నటుడు సీనియర్ నరేష్ కుమారుడు నవీన్ విజయ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ పాటలో కలర్స్ స్వాతి కూడా కనిపించింది. ఆర్మీ సోల్జర్స్‌కు, వాళ్లను వెనక ఉండి నడిపించే మహిళలకు ఈ సాంగ్‌ను అంకితం ఇచ్చారు.
ఫీల్ గుడ్ కంటెంట్‌తో వచ్చిన The Soul Of satya వీడియో సాంగ్‌కు అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. దీంతో ఈ పాటకు యూట్యూబ్‌లో లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో సాయి ధరమ్ తేజ్ - స్వాతి మధ్య కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. మొత్తంగా ఈ పాట అనుకున్న దానికంటే ఎక్కువగానే సక్సెస్ అయింది.తన స్నేహితుడైన నవీన్ విజయ కృష్ణ దర్శకత్వంలో సాయి తేజ్ చేసిన The Soul Of satya వీడియో సాంగ్‌ను ఇటీవలే విడుదల చేశారు. దీన్ని సినీ సెలెబ్రిటీలు కూడా తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో ప్రమోట్ చేశారు. ఈ క్రమంలోనే సాయి తేజ్ దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. మెగా డాటర్ నిహారిక 'దీన్ని చూడడానికి వేచి ఉండలేను' అని కామెంట్ చేసింది.
'సత్య' సాంగ్ గురించి సాయి ధరమ్ తేజ్ షేర్ చేసిన పోస్టుకు నిహారిక కామెంట్ చేయగా.. ఆమెకు ఓ నెటిజన్ ఊహించని రిప్లై ఇచ్చాడు. అందులో 'వీటి మీద ఉన్న ఇంట్రెస్ట్ ఫ్యామిలీ మీద లేకపాయే' అంటూ అసభ్యంగా కామెంట్ చేశాడు. దీంతో ఇది చూసిన మెగా అభిమానులకు మండిపోయింది. ఆ వెంటనే అతడిని టార్గెట్ చేస్తూ చాలా మంది రిప్లైలు కూడా ఇచ్చారు.నిహారికను అవమానించేలా నెటిజన్ చేసిన కామెంట్‌కు సాయి ధరమ్ తేజ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. 'మైండ్ యువర్ టంగ్.. ఆ కామెంట్‌ను వెంటనే డిలీట్ చెయ్' అంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో సదరు నెటిజన్ తన కామెంట్ తీసేశాడు. ఆ తర్వాత సాయి తేజ్ కూడా డిలీట్ చేశాడు. కానీ, ఈ స్క్రీన్ షాట్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి