టాలీవుడ్ హీరో ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం సలార్.ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లేవల్లో నిర్మిస్తూ ఉన్నారు.. భారీ అంచనాల మధ్య ఈ సినిమా సెప్టెంబర్ 28 న విడుదల కాబోతోంది.ఇందులో హీరోయిన్గా శృతిహాసన్ నటించింది .జగపతిబాబు తదితరులు సైతం ఇందులో కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. కే జి ఎఫ్ చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ప్రశాంత్ నీల్, ప్రభాస్ సినిమా చేస్తూ ఉండడంతో అభిమానులకు భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి


సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ గ్లింప్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు. తాజాగా ప్రభాస్ అభిమానులకు ఒక పండుగ లాంటి వార్త తెలియజేస్తోంది చిత్ర బృందం ..ఈ చిత్రాన్ని ఐమాక్స్ ఫార్మాట్లో విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సలార్ అమెరికన్ డిస్ట్రిబ్యూటర్ ఒక ట్విట్టర్ రూపంలో తెలియజేశారు. ఈ ఐమాక్స్ వర్షన్ టికెట్ బుకింగ్ కూడా త్వరలోనే మొదలు కాబోతున్నాయని తెలియజేయడం జరిగింది. అయితే ఇండియాలో ఇది అందుబాటులో ఉందా లేదా అనే విషయం పైన మాత్రం ఇంకా స్పష్టత రాలేదని చెప్పవచ్చు..


ఒకవేళ ఇక్కడ కూడా ఐమాక్స్ వర్షన్ లో ఈ సినిమా రిలీజ్ చేస్తే మూవీ క్వాలిటీ అభిమానులను ఆకట్టుకుంటుందని పలువురు టేక్ నిపుణులు  సైతం తెలియజేస్తున్నారు. ఇటీవలే ప్రభాస్ నటించిన ఆది పురుష్ చిత్రం ఈ వర్షన్ లో విడుదల చేద్దామని మేకర్స్ భావించగా కొన్ని కారణాల చేత అది కుదరలేక పోయిందట. ఇప్పుడు మరొకసారి ప్రభాస్ సినిమా ఐమాక్స్ వర్షన్ లో విడుదలైన బాహుబలి-2 సినిమా కూడా బాగానే ఆకట్టుకుంది.ఇప్పుడు సలార్ సినిమా కూడా విడుదల అయితే ప్రభాస్ నటించిన చిత్రాలు రెండు సినిమాలు ఐమాక్స్ ఫార్మాట్లో విడుదలవుతున్నాయని చెప్పవచ్చు. యాక్షన్ సన్నివేశాలతో రాబోతున్న సలార్ సినిమా అభిమానులను ఏ విధంగా మెప్పిస్తుంది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: