1988లో చిరంజీవి మరణం మృదంగం సినిమా విడుదల అయింది..అప్పటికే చిరంజీవి ఒక స్టార్ హీరో.. చెన్నై లొకేషన్ లో ఉన్నప్పుడే అభిమానులు చాలా గుంపులు గుంపులుగా వచ్చారట. ఫోటోల కోసం అభిమానులు ఎగబడుతూ ఉండడంతో రోజు షూటింగ్లో భాగంగా సెట్ కి వెళ్లారట .. సెట్ నుంచి బయట అడుగుపెట్టగానే అభిమానులు భారీ ఎత్తున ఉండడంతో.. ఒకసారి పలకరిద్దామని అలా బయటకు వెళ్లారట.. ఇంతలోనే ఒక అభిమాని గుంపులో నుంచి వచ్చి బర్తడే జరుపుకుంటున్నారని తనతో పాటు తీసుకువచ్చి కేక్ కట్ చేయడం జరిగిందట. చిరంజీవి వద్దని వాదించిన సరే చిరంజీవి నోట్లో పెట్టాడట..
రుచి తేడాగా ఉండడంతో చిరంజీవి దాన్ని ఉమ్మేసారట ఆ సమయంలో తోపులాట జరగడంతో బల్ల పైన ఉన్న కేక్ ఒక్కసారిగా పడిపోయింది. దీంతో ఆ కేకులో ఉండే రంగులు కూడా బయటపడ్డాయి.. ఈ గ్యాప్ లోనే చిరంజీవి సిబ్బంది సైతం చిరంజీవి పెదాలు నీలిరంగులో మారడం గమనించారు. అనుమానంతో ఆసుపత్రికి తీసుకువెళ్లాగా అక్కడ విరుగుడు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కేక్ తెచ్చిన వాడిని అభిమానులు వెతికి పట్టుకుని తన్నేసరికి ఒక్కసారిగా నిజం చెప్పారు.. అలా చేసింది కూడా అభిమానంతోనే చిరంజీవి తనతో మాట్లాడడం లేదని ఇతరులతో చాలా క్లోజ్ గా ఉండడం సహహించలేకపోయారని అందుకే కేరళ నుంచి వశీకరణం చేసిన పౌడర్ ని అందులో కలిపేశానని తెలియజేశారు. అలా చిరంజీవి పై విష ప్రయోగం జరిగిందట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి