కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు వరుస విజయాలను సొంతం చేసుకున్న మోహన్ బాబు ఈ మధ్య కాలం లో నటించిన సినిమాలేవీ సక్సెస్ సాధించ లేదు.మోహన్ బాబుకు మంచి ఆఫర్లు వస్తున్నా సక్సెస్ రేట్ అంతకంతకూ తగ్గుతుండటంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అయితే ప్రముఖ నటుడు, దర్శకుడు దేవీ ప్రసాద్ మోహన్ బాబు గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.ట్రోల్స్ లో నిజాలు ఉండవని అవి అసలు వాళ్లకు తెలియదని దేవీ ప్రసాద్ అన్నారు. ఒకానొక సమయంలో చిరంజీవి గారిపై కూడా ట్రోల్స్ వచ్చాయని ఆయన పేర్కొన్నారు. కరోనా సమయం లో కార్మికుల కోసం మెగాస్టార్ చిరంజీవి ఎంతో చేశారని బాలయ్య సైతం ఇబ్బందులు పడుతున్న ఎంతో మందిని ఆదుకున్నారని మహేష్ ఎంతోమంది పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించారని దేవీ ప్రసాద్ అన్నారు.

మోహన్ బాబు తన స్కూల్ లో ఎంతో మందికి ఫ్రీ సీట్లు ఇచ్చారని ఆయన కామెంట్లు చేశారు. ట్రోల్స్ చేసేవాళ్ల ట్రోల్స్ వాళ్ల మానసిక పరిస్థితి గురించి తెలియజేస్తాయని దేవీ ప్రసాద్ వెల్లడించారు. గీతా సింగ్ మోహన్ బాబు ఫ్యామిలీ గొప్పదనం గురించి చెప్పారని ఆయన కామెంట్లు చేశారు. సమాజం కులాలు మతాల వారీగా విడిపోయిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈటీవీ ప్రభాకర్ గారి అబ్బాయి చంద్రహాస్ తొలి సినిమా రిలీజ్ కాకుండానే దారుణంగా ట్రోల్స్ చేశారని దేవీ ప్రసాద్ అన్నారు.చంద్రహాస్ పై ట్రోల్స్ చేసేవాళ్లు అతని లా డ్యాన్స్ చేయగలరా? అని దేవీ ప్రసాద్ ప్రశ్నించారు. ఒక్కొక్కరి బాడీ లాంగ్వేజ్ ఒక్కో విధం గా ఉంటుందని ఆయన కామెంట్లు చేశారు. ప్రతి మనిషి లో శాడిజం ఉంటుందని దేవీ ప్రసాద్ అన్నారు. దేవీ ప్రసాద్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: